కర్ణాటకలో కేబినెట్ విస్తరణ..17 మంది ప్రమాణస్వీకారం

Share Icons:

బెంగళూరు:

 

కర్ణాటకలో కాంగ్రెస్-జేడీఎస్ ప్రభుత్వం కూలిపోయి బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన విషయం తెలిసిందే. సీఎం గా యడియూరప్ప ప్రమాణస్వీకారం చేశారు. ఈ క్రమంలోనే బీజేపీ ప్రభుత్వం ఈరోజు మంత్రివర్గ విస్తరణను చేపట్టింది. ఇండిపెండెంట్ ఎమ్మెల్యే హెచ్.నగేశ్ సహా 17 మంది కేబినెట్ మంత్రులుగా ప్రమాణస్వీకారం చేశారు. ఐరన్ ఓర్ మైనింగ్ కింగ్ గాలి జనార్దన్ రెడ్డి ప్రధాన అనుచరుడు బి.శ్రీరాములు కూడా ప్రమాణ స్వీకారం చేశారు.

 

బెంగళూరులోని రాజ్ భవన్ లో వీరందరి చేత గవర్నర్ వాజూభాయ్ వాలా ప్రమాణస్వీకారం చేయించారు. ప్రమాణస్వీకారం చేసిన వారిలో ఆర్. అశోక, జగదీశ్ షెట్టార్, మక్తప్ప కరజోల్, డాక్టర్ అశ్వర్థ్ నారాయణ్, కేఎస్ ఈశ్వరప్ప, లక్ష్మణ్ సంగప్ప సవడి, సీటీ రవి, ఎస్. సురేశ్ కుమార్, వి.సోమన్న, కోట శ్రీనివాస్ పూజారి, బసవరాజ్ బొమ్మై, ప్రభు చౌహాన్, జేసీ మధుస్వామి, చంద్రకాంత గౌడ, జె. శశికళ ఉన్నారు

Leave a Reply