కర్ణాటక ఉపఎన్నికల్లో కాంగ్రెస్, జేడీఎస్ హవా.. బీజేపీకి షాక్..

karnataka-bypoll-results-congress-jds-leads-bjp-may-remain-in-one-seat-
Share Icons:

బెంగళూరు, 6 నవంబర్:

కర్ణాటక ఉపఎన్నికల్లో బీజేపీ పార్టీకి భారీ షాక్ తగిలింది. ఆ రాష్ట్రంలో ఇటీవల 3 లోక్‌సభ, 2 అసెంబ్లీ స్థానాలకి గత శనివారం ఎన్నికలు జరగగా…ఈరోజు ఫలితాలు వెలువడ్డాయి. ఈ ఫలితాల్లో కాంగ్రెస్, జేడీఎస్ పార్టీలు సత్తా చాటాయి.

అందులోనూ ముఖ్యంగా బీజేపీకి గట్టి పట్టున్న ప్రాంతం, గాలి జనార్ధన్ రెడ్డి వర్గీయుల కంచుకోటగా భావించే బళ్లారి లోక్‌సభలో ఈ సారి బీజేపీకి భారీ షాక్ తగిలింది. ఈ స్థానంలో కాంగ్రెస్ అభ్యర్థి ఉగ్రప్ప 1,84, 203 ఓట్ల భారీ మెజార్టీతో విజయం సాధించారు. ఇక మాండ్య లోక్‌సభ స్థానంలో జేడీఎస్ అభ్యర్థి శివరామగౌడ ఘన విజయం సాధించారు. బీజేపీ మాజీ సీఎం యడ్యూరప్ప సొంత స్థానమైన షిమోగలో ఆయన తనయుడు రాఘవేంద్ర 35వేల ఓట్ల ఆధిక్యంలో కొనసాగుతున్నారు.

ఇక రామనగరం అసెంబ్లీ స్థానంలో నుంచి జేడీఎస్ అభ్యర్థిగా బరిలో ఉన్న ముఖ్యమంత్రి కుమారస్వామి సతీమణి అనిత ఘన విజయం సాధించారు. మరో అసెంబ్లీ స్థానం జమఖండీలో కాంగ్రెస్ విజయం సాధించింది. మిగతా సీట్ల సంగతి ఎలా ఉన్నా… బళ్లారిలో బీజేపీ ఓటమి పాలవ్వడం ఆ పార్టీ జీర్ణించుకోలేకపోతోంది.

మామాట: బళ్ళారిలో మాత్రం బీజేపీకి గట్టి దెబ్బే తగిలింది….

Leave a Reply