కన్నడ రాజకీయం: జైల్లో ట్రబుల్ షూటర్… కన్ఫ్యూజన్ లో కాంగ్రెస్..

Share Icons:

బెంగళూరు: కర్ణాటకలో కాంగ్రెస్-జేడీఎస్ ప్రభుత్వం కూలిపోయి బీజేపీ ప్రభుత్వం ఏర్పాటులో ప్రధాన పాత్ర పోషించిన 17 మంది ఎమ్మెల్యేలపై అనర్హత వేటు పడిన విషయం తెలిసిందే. అయితే వారిపై అనర్హత పడటంతో ఆయా స్థానాల్లో ఉపఎన్నికలు నిర్వహించేందుకు కేంద్ర ఎన్నికల సంఘం సిద్ధమైంది. రెండు స్థానాల విషయం కోర్టులో ఉండటంతో…వాటిని పక్కనబెట్టి మిగిలినా 15 స్థానాలకు ఎన్నికలు నిర్వహించేందుకు నోటిఫికేషన్ విడుదల చేశారు. అక్టోబర్ 21న ఈ స్థానాల్లో పోలింగ్ జరగనుండగా..24 తేదీన ఫలితాలు వెలువడనున్నాయి.

ఈ నేపథ్యంలో ఉపఎన్నికల్లో తమ పార్టీ అభ్యర్ధులని నిలపడంలో కన్ఫ్యూజన్ లో ఉంది. మరో నాలుగు రోజులు మాత్రమే నామినేషన్‌ల దాఖలుకు గడువుంది. ఇంకా అభ్యర్థుల ఖరారు కాలేదు. మూడు రోజులుగా రాష్ట్ర పార్టీ ముఖ్యనేతలు సిద్దరామయ్య, దినేశ్‌ గుండూరావు, పరమేశ్వర్‌లు అభ్యర్థుల ఎంపికకోసం కసరత్తు చేస్తున్నారు. రాష్ట్రంలో దాదాపు రెండు దశాబ్దాలుగా జరిగిన ప్రతి ఎన్నికల్లోనూ అభ్యర్థుల ఖరారులో కాంగ్రెస్ లో ట్రబుల్ షూటర్ గా పేరొందిన డి.కె.శివకుమార్‌ ప్రమేయం కొనసాగేది. ఇందుకు ప్రధాన కారణం ఆయన సూచించే అభ్యర్థుల తరపున అన్నీ తానై వ్యవహరించేవారు.

కాంగ్రెస్‌ అధిష్ఠానంలోని కీలకులైన సోనియాగాంధీ, రాహుల్‌గాంధీలతో సన్నిహిత సంబంధాలు ఉన్నందున ఆయనకు ఇటు రాష్ట్రంలోనూ ప్రాధాన్యత ఉండేది. ప్రస్తుతం ఉపసమరంతోపాటు మరో నాలుగు రోజుల్లోనే బెంగళూరు మేయర్‌ ఎన్నిక కూడా సాగుతోంది. ఇలాంటి కీలక సమయంలో డి.కె.శివకుమార్‌ అండగా ఉంటారని భావించారు. కానీ ఆయన మనీలాండరింగ్‌ కేసులో తిహార్‌జైలు పాలయ్యారు. అలాగే బెయిల్‌ పిటీషన్‌ తిరస్కరణ కావడంతో ప్రస్తుత ఉపసమరానికి డి.కె.శివకుమార్‌ బయటకు వచ్చే అవకాశాలు లేవనిపిస్తోంది. బెయిల్‌కోసం మరోసారి ఢిల్లీ కోర్టులో ప్రయత్నాలు చేసుకునే వెసలుబాటు ఉంది.

మరోవైపు అనర్హత వేటు పడిన 17మంది ఎమ్మెల్యేల నియోజకవర్గాలలో ఉప ఎన్నికలు జరిగేందుకు నోటిఫికేషన్‌ జారీ అయిందని అందులో పోటీ చేసే అవకాశం కల్పించాలని సుప్రీం ధర్మాసనానికి వివరించారు. అనర్హత ఎమ్మెల్యేల తరపున సీనియర్‌ న్యాయవాది ముకుల్‌ రోహ్టగి వాదనలు వినిపించారు. ఎమ్మెల్యేలు నేరుగా స్పీకర్‌కు రాజీనామా లేఖలు అందించారని వెంటనే ఆమోదించకుండా జాప్యం చేశారని 2023వరకు అనర్హత వేటు వేశారని ఇది చట్టరీత్యా సరికాదన్నారు. 17 మంది ఎమ్మెల్యేలపై అనర్హత వేటుపడగా 15చోట్ల ఎన్నికలు జరిగేలా నోటిఫికేషన్‌ వెలువడిందని నామినేషన్‌ల దాఖలుకు కేవలం 5 రోజులు మాత్రమే గడువు ఉందని మరోసారి వారు ప్రజాస్వామ్యబద్ధంగా పోటీ చేసే అవకాశం కల్పించి సామాజిక న్యాయం వర్తింపు చేయాలని కోరారు.

 

Leave a Reply