అధిష్టానం ఆదిశిస్తే చీరాల నుండి పోటీకి రెడీ…

Share Icons:

గుంటూరు, 14 ఫిబ్రవరి:

బుధవారం చీరాల ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్‌ టీడీపీకి గుడ్‌బై చెప్పి వైసీపీలో చేరాలని నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. ఇక చీరాలలో పరిస్థితులు చక్కదిద్దాలని చంద్రబాబు సీనియర్ నేత కరణం బలరాంకి సూచించారు.

ఈ నేపథ్యంలో బలరాం ఈరోజు మీడియాతో మాట్లాడుతూ…  చీరాల టికెట్‌ బీసీలకు ఇవ్వాలని అధిష్ఠానాన్ని కోరినట్లు చెప్పారు. నన్ను ఆదేశించినా పోటీ చేస్తానన్నారు. పార్టీ వీడుతూ ఆమంచి చేస్తున్న వ్యాఖ్యలు సరికాదని, ఆయన లేకపోవడం వల్ల పార్టీకి వచ్చిన నష్టం ఏమీలేదన్నారు.

ఇక పార్టీకి కష్ట కాలం వచ్చినప్పుడే అధినాయకులకు తాను గుర్తుకు వస్తుంటానని, అయినా వారి ఆదేశాలు శిరసావహిస్తానని చెప్పారు. రానున్న ఎన్నికల్లో పార్టీ ఆదేశిస్తే చీరాల నుంచి పోటీ చేసేందుకు నేను సిద్ధంగా ఉన్నానని ప్రకటించారు.

మరోవైపు.. గత కొంతకాలంగా నియోజకవర్గానికి దూరంగా ఉంటున్న ఎమ్మెల్సీ పోతుల సునీత కూడా బుధవారం నియోజకవర్గంలో తన అనుచరుతో ర్యాలీ నిర్వహించారు. గత ఎన్నికల్లో పరాజయం పాలైన సునీత మరోసారి తన అదృష్టాన్ని పరీక్షించుకోవాలని చూస్తున్నారని సమాచారం. మరి అధిష్టానం చీరాల బరిలో ఎవరిని దింపుతుందో చూడాలి…

మామాట: రసవత్తరంగా మారిన చీరాల రాజకీయం…

Leave a Reply