“కేఎల్ రాహుల్‌ టీమిండియాకు దొరికిన గొప్ప ఆస్తి!” -కపిల్ దేవ్

Share Icons:

టీమిండియా ఓపెనర్‌ కేఎల్ రాహుల్‌పై భారత మాజీ కెప్టెన్‌ కపిల్‌ దేవ్‌  ప్రశంసల వర్షం కురిపించాడు. రాహుల్‌ టీమిండియాకు దొరికిన గొప్ప ఆస్తిగా అతడు కొనియాడాడు. “యూఏఈలో జరిగే టి20 వరల్డ్ కప్‌లో రాహుల్ భారత జట్టుకు భారీ ఆస్తిగా మారుతాడు. అలాగే భవిష్యత్తులో భారత్‌ సాధించే ప్రతీ విజయంలో రాహుల్‌ కీలక పాత్ర పోషిస్తాడు. కెఎల్ రాహుల్ బ్యాటింగ్ అంటే నాకు చాలా ఇష్టం. అతడు ఆడే షాట్లపై అతనికి చాలా నమ్మకం ఉంది. ఈ మెగా టోర్నీలో రాహుల్‌ అధ్బుతంగా రాణిస్తాడని ఆశిస్తున్నాను.  టి20 ప్రపంచకప్‌లో భారత్‌ ఖచ్చితంగా మొదటి నాలుగు స్థానాల్లో నిలుస్తుందని” కపిల్ దేవ్ పేర్కొన్నాడు.

అదేవిధంగా భారత జట్టుకు మెంటార్‌గా ఎంపికైన ధోని.. తన అనుభవంతో జట్టును విజయపథంలో నడిపించగలడని కపిల్‌ దేవ్‌ అభిప్రాయపడ్డాడు. కాగా కెఎల్ రాహుల్ టి20 ప్రపంచకప్‌లో భాగంగా  జరిగిన మొదటి వార్మప్ మ్యాచ్‌లో ఇంగ్లండ్‌పై 51 పరుగులు చేశాడు. 6 ఫోర్లు, 3 సిక్సర్లతో 23 బంతుల్లో మెరుపు అర్ధ సెంచరీ సాధించాడు. బుధవారం ఆస్ట్రేలియాతో జరిగిన వార్మప్‌ మ్యాచ్‌లోను రాహుల్‌ 39 పరుగులు సాధించి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు.

సేకరణ :- మామాట డస్క్ (అంతర్జాల సంచికల నుండి)

Leave a Reply