చంద్రబాబు గురించి సంచలన విషయాలు చెప్పిన కన్నా…

Share Icons:

విజయవాడ, 3 నవంబర్:

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు గురించి ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీ నారాయణ కొన్ని సంచలన విషయాలు చెప్పారు. ఈరోజు ఆయన విజయవాడ లో మీడియాతో మాట్లాడుతూ…  చంద్రబాబు కాంగ్రెస్ పార్టీలో ఉండగా మామ ఎన్టీఆర్ పైనే పోటీ చేస్తానని సవాలు విసిరి… ఎన్నికల్లో ఓడిపోయాక కాళ్లు పట్టుకుని ఆయన పంచన చేరారని దుయ్యబట్టారు.

ఇక ఎన్టీఆర్ టీడీపీని చీలుస్తాననీ, సాయం చేయాలని అప్పట్లో చంద్రబాబు వైఎస్ రాజశేఖరరెడ్డిని కోరారనీ, అయితే దాన్ని సున్నితంగా వైఎస్ తిరస్కరించారని కన్నా వ్యాఖ్యానించారు. ఈ విషయాన్ని ఓ జాతీయ మీడియా ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో వైఎస్ బయటపెట్టారని వెల్లడించారు.

ప్రజల నిర్ణయాన్ని గౌరవించాలని, కాంగ్రెస్ పార్టీని ప్రజలు తిరస్కరించారని వైఎస్ చెప్పినట్లు కన్నా గుర్తుచేసుకున్నారు. అయితే ఈ కుట్ర 1996లో వైస్రాయ్ ఘటనతో పూర్తయిందన్నారు. ఎన్టీఆర్ ను చంపేశాక ఇప్పుడు చంద్రబాబు ఆయనకు రోజూ దండ వేస్తున్నారని విమర్శించారు.

అలాగే ప్రతీ ఎన్నికలకు కొత్త భాగస్వామిని ఎన్నుకోవడం చంద్రబాబు నైజమని ఎద్దేవా చేశారు. చంద్రబాబు లాంటి అవకాశవాద నాయకుడు దేశంలో మరొకరు లేరని విమర్శించారు. చొక్కాలు మార్చినట్లు మాటలు మార్చడంలో చంద్రబాబు ఉద్ధండుడని దుయ్యబట్టారు.

మామాట: ఈ విషయాన్ని మీ పార్టీతో పొత్తులో ఉన్నప్పుడూ చెబితే బాగుండేదేమో కన్నా గారు….

Leave a Reply