ఉగ్ర రాకతో మారిన కనిగిరి రాజకీయం…

Share Icons:

ప్రకాశం, 22 మార్చి:

కాంగ్రెస్‌లో సీనియర్ నేతగా ఉన్న ఉగ్ర నరసింహారెడ్డి టీడీపీలోకి రావడంతో కనిగిరిలో రాజకీయ సమీకరణలు ఒక్కసారిగా మారిపోయాయి. గత ఎన్నికల్లో కనిగిరి నుంచి గెలిచిన కదిరి బాబూరావుని ఈ సారి దర్శి బరిలో నిలిపి.. ఉగ్ర నరసింహారెడ్డిని కనిగిరి బరిలో దించారు.

నియోజకవర్గ ప్రజలకు సుపరిచితుడు, సన్నిహితుడు అయిన ఉగ్రకు అటు టీడీపీ శ్రేణుల నుంచే కాక తటస్థవాదులు నుంచి కూడా మద్దతు లభిస్తోంది. అటు వైసీపీ తరఫున గత ఎన్నికల్లో పోటీచేసిన బుర్రా మధుసూదన్‌ రంగంలో ఉన్నారు. ఆయనకి యాదవ సామాజికవర్గంలో మంచి పట్టు ఉంది. అయితే రెడ్డి సామాజికవర్గంలోని నాయకులతో సన్నిహిత సంబంధాలు ఏర్పడలేదు. ఈ నేపథ్యంలో ఉగ్ర రంగంలోకి రావడంతో క్షేత్రస్థాయిలో ఆయనకు మద్దతుగా వలసలు పెరుగుతున్నాయి.

ఉగ్రసేన కార్యకర్తలు వెనుకుండి టీడీపీ శ్రేణులతో కలిసి పయనించడంతోపాటు సరికొత్త సమీకరణలు ప్రారంభం కావడంతో నూతనోత్తేజం కనిపిస్తున్నది. కానీ రాష్ట్ర వ్యాప్తంగా వైకాపాకి పెరిగిన బలం…జగన్ పాదయాత్ర తనకి కలిసొస్తాయని మధు ఉన్నారు. ఈ నియోజకవర్గంలో రెడ్లు, యాదవ, కమ్మ,ఎస్సీలు ప్రధాన సామాజిక వర్గాలుగా ఉన్నాయి. వీరే గెలుపోటములని ప్రభావితం చేస్తారు.

మామాట: మరి ఈ సారి కనిగిరి ఎవరి సొంతమవుతుందో

Leave a Reply