‘అరెస్ట్ చేసేందుకు వ‌స్తే..ఇంటి ద‌గ్గ‌ర నా మూడ్’ ఇలా అంటూ కంగనా పోస్ట్!

Share Icons:

వివాదాలకు కేరాఫ్‌ అడ్రస్‌ అయిన బాలీవుడ్‌ ఫైర్‌ బ్రాండ్‌ కంగనా రనౌత్‌  తన తీరు, వివాదస్పద వ్యాఖ్యలతో తరచు  వార్తల్లో నిలుస్తుంది. తాజాగా సిక్కులపై అనుచిత వ్యాఖ్యలు చేసి మరోసారి వార్తల్లోకి ఎక్కింది కంగనా. అంతేకాదు ఆమె పోలీసు కేసు కూడా నమోదైంది. ఇటీవల సాగు చట్టాలను రద్దు చేస్తూ మోదీ ప్రభుత్వం ప్రకటించిన విష‌యం తెలిసిందే. దీంతో రైతులు ఆనందంలో మునితేలుతుంటే కంగనా వారిపై చేసిన కామెంట్స్‌ వివాదానికి దారి తీశాయి.

రైతులను ఉద్దేశిస్తూ ఆమె ‘దీన్ని ఖ‌లిస్థానీ ఉద్య‌మం’ అంటారంటూ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ పెట్టింది. దీంతో సబ్‌ అర్బన్‌ ఖార్‌ పోలీస్‌ స్టేషన్‌లో ఢిల్లీ సిక్‌ గురుద్వారా మేనేజ్‌మెంట్‌ కమిటీ కంగనాపై ఫిర్యాదు చేశారు. వారి ఫిర్యాదు మేరకు పోలీసులు సోమవారం ఆమెసౌ ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశారు. రైతు ఉద్యమాన్ని  ఉద్దేశపూర్వకంగానే ‘ఖలిస్తాన్‌’ఉద్యమం అని, సిక్కులను ఖలిస్తానీ టెర్రరిస్టులంటూ వ్యాఖ్యలు చేశారని ఫిర్యాదులో కమిటీ సభ్యులు పేర్కొన్నారు. దీనిపై కంగనా స్పందిస్తూ సోషల్‌ మీడియాలో సంచలన పోస్ట్‌ షేర్ చేసింది.

చేతిలో వైన్‌ గ్లాస్‌ పట్టుకుని గతంలోని ఫొటోషూట్‌కు సంబంధించిన ఫొటోను ఇన్‌స్టా స్టోరీలో షేర్‌ చేస్తూ.. ‘మ‌రొక రోజు మ‌రో ఎఫ్ఐఆర్‌. ఒక‌వేళ వాళ్లు నన్ను అరెస్ట్ చేసేందుకు వ‌స్తే..ఇంటి ద‌గ్గ‌ర నా మూడ్’ అంటూ క్యాప్ష‌న్ ఇచ్చింది. కాగా సున్నిత‌మైన రైతుల అంశంలో కంగ‌నా చేసిన కామెంట్ల‌పై క్ష‌మాప‌ణలు చెప్పాల‌ని డిమాండ్ చేస్తున్న వ్య‌క్తుల‌కు త‌న‌దైన శైలిలో వ్యంగ్యంగా స‌మాధాన‌మిచ్చింది కంగనా. మ‌రి దీనిపై ఎవ‌రూ ఎలా స్పందిస్తారో చూడాలి. అయితే కంగనా షేర్‌ చేసిన​ ఈ ఫొటో నెట్టింట వైరల్‌గా మారింది. ఇక కంగనా తీరుపై ఎప్పటిలాగే నెటిజన్లు విమర్శలు గుప్పిస్తున్నారు. తన తీరుపై మండిపడుతున్నారు.

సేకరణ :- మామాట డస్క్ (అంతర్జాల సంచికల నుండి)

Leave a Reply