అదరగొడుతున్న ‘మణికర్ణిక’ ట్రైలర్..

Share Icons:

ముంబై, 18 డిసెంబర్:

వీర వనిత ఝాన్సీ లక్ష్మీబాయి జీవితకథ ఆధారంగా కంగ‌నా ర‌నౌత్‌ ప్ర‌ధాన పాత్ర‌లో క్రిష్ తెర‌కెక్కించిన చిత్రం మణికర్ణిక..ది క్వీన్ ఆఫ్ ఝాన్సీ. భారీ బ‌డ్జెట్‌తో జీ స్టూడియోస్ నిర్మిస్తున్న ఈ చిత్ర షూటింగ్ దాదాపు పూర్తి కాగా, కొంత ప్యాచ్ వ‌ర్క్ కంగ‌నా ద‌ర్శ‌క‌త్వం లో రూపొందింది.

ఈ చిత్రం వచ్చే ఏడాది గణతంత్ర దినోత్సవం కానుకగా జనవరి 25న విడుదలకానుంది. అక్టోబ‌ర్ 2న గాంధీ జ‌యంతి సంద‌ర్భంగా చిత్ర టీజ‌ర్ విడుద‌ల చేయగా…తాజాగా ట్రైల‌ర్ విడుద‌ల చేశారు.

ఇందులో క‌ద‌నరంగంలో క‌ర‌వాలం ప‌ట్టి శ‌త్రు మూక‌ల‌ని గ‌డ‌గ‌డ‌లాడించే ధీర వ‌నితగా కంగనా అద‌ర‌గొట్టింది. ట్రైల‌ర్‌తో మూవీపై అంచ‌నాలు భారీగా పెరిగాయి. ఈ చిత్రానికి సంగీత త్రయం శంకర్- ఎహసాన్- లాయ్ లు స్వరాలు సమకూరుస్తున్నారు.

మామాట: మరి సినిమా ఏ స్థాయిలో ప్రేక్షకులని ఆకట్టుకుంటుందో

Leave a Reply