ఎలక్షన్ల తర్వాతే ‘కాంచన-3’!!

Share Icons:

హైదరాబాద్, 11 మార్చ్:

నటనలో, నృత్యంలో, దర్శకత్వంలో తనదైన ముద్ర వేసుకుని అందరి మనసులు దోచుకున్న లారెన్స్ నుండి మరో హార్రర్ చిత్రం రాబోతున్న సంగతి తెలిసిందే.

అటు తమిళ ఇండస్ట్రీలోనూ, ఇటు తెలుగు ఇండస్ట్రీలోనూ హార్రర్ చిత్రాలను తెరకెక్కించి, అందులో నటించి అద్భుతమైన విజయాలు సాధించారు.

గతంలో వచ్చిన కాంచన, గంగ హార్రర్ థ్రిల్లర్ చిత్రాలకు సీక్వెల్ గా రానున్న ‘కాంచన-3’ షూటింగ్ పూర్తైపోయింది.
ఈ సినిమా కోసం ఎప్పటి నుండో ఎదురు చూస్తున్న అభిమానులకు లారెన్స్ శుభవార్త చెప్పాడు. ఎన్నికల సమరం పూర్తయిన వారనికే ఈ చిత్రం విడుదల కానుంది.

ఓవియా, వేదిక లారెన్స్ ప్రధాన పాత్రలలో నటిస్తున్న ఈ చిత్రం ఏప్రిల్ 19న ప్రేక్షకులను అలరించబోతుంది.

గతంలో కాంచన, గంగతో అందరినీ భయపెట్టి మెప్పించిన లారెన్స్ ఈ చిత్రంతో మరింత మెప్పించనున్నారట.

మామాట: చూద్దాం.. ఏ మేరకు భయపెడతారో…

Leave a Reply