నెంబర్1లో ట్రెండ్ అవుతున్న కమ్మ రాజ్యంలో కడప రెడ్లు ట్రైలర్….కోర్టుకెక్కిన పాల్

kamma rajyamlo kadapa redlu tralier 2
Share Icons:

హైదరాబాద్: వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఏంసినిమా తీసిన అది పెద్ద వివడమే అవుతుంది. తాజాగా ఆయన ఏపీలోని ప్రస్తుత రాజకీయాలపై కమ్మ రాజ్యంలో కడప రెడ్లు చిత్రం తెరకెక్కించారు. ఈ చిత్రంలో ప్రస్తుత రాజకీయ నాయకుల పాత్రల ఆధారంగా వచ్చిన ట్రైలర్లు యూట్యూబ్ లో ట్రెండ్ సృష్టిస్తున్నాయి. తాజాగా  చిత్రంలోంచి  ట్రైలర్- 2 విడుదల చేసిన విషయం తెలిసిందే. ఇది యూట్యూబ్ లో ట్రెండింగ్ నంబరు 1లో ఉందంటూ ఆయన ఈ రోజు ట్వీట్ చేశారు. ఇప్పటికే ఈ ట్రైలర్ కు మూడు మిలియన్ల వ్యూస్ వచ్చాయని చెప్పారు. నిన్న ఉదయం 9.36 గంటలకు ఈ సినిమాకు సంబంధించి ట్రైలర్- 2 విడుదల చేశారు. 

సినిమా టైటిల్ తోనే వివాదం రేపిన రామ్ గోపాల్ వర్మ… ఈ చిత్రానికి సంబంధించి మొదటి ట్రైలర్ తో మరింత వేడి పుట్టించారు. తాజాగా రెండో ట్రైలర్ అంటూ మరోసారి అందరి దృష్టినీ ఆకర్షించారు. అప్పుడప్పుడు ఈ సినిమాలో పలు ఆసక్తికర పోస్టర్లను విడుదల చేస్తూ సినిమాపై ఆసక్తి రేపుతున్నారు. ఏపీ రాజకీయాల్లో పలువురు నేతలను ఉద్దేశించి ఈ సినిమా రూపొందింది.

ఇక ఈ సినిమాలో తన క్యారెక్టర్ ను అవమానించేలా చూపించారంటూ క్రైస్తవ మత ప్రబోధకుడు కేఏ పాల్, హైకోర్టును ఆశ్రయించారు. ఈ సినిమా విడుదలను అడ్డుకోవాలని కోరుతూ, పిటిషన్ ను దాఖలు చేశారు. ఈ కేసులో ప్రతివాదులుగా కేంద్ర సమాచార మంత్రిత్వ శాఖ, సెన్సార్ బోర్డు, రామ్ గోపాల్ వర్మ, జబర్దస్త్ కమేడియన్ రాము తదితరులను చేర్చారు. కేఏ పాల్ పిటిషన్ పై నేటి మధ్యాహ్నం తరువాత హైకోర్టులో విచారణ జరుగనుందని సమాచారం. కాగా, ఈ చిత్రాన్ని ఈ నెల 29న విడుదల చేసేందుకు నిర్మాతలు సన్నాహాలు చేస్తున్న సంగతి తెలిసిందే.

కార్తికేయ 90ఎం‌ఎల్ ట్రైలర్

కార్తికేయ కథానాయకుడిగా దర్శకుడు శేఖర్ రెడ్డి ’90ML ‘ సినిమాను రూపొందించాడు. ఈ సినిమా ద్వారా నేహా సోలంకి కథానాయికగా పరిచయమవుతోంది. తాజాగా ఈ సినిమా నుంచి ఒక ట్రైలర్ ను రిలీజ్ చేశారు. హీరోకి చిన్నప్పటి నుంచి వున్న ఒక హెల్త్ ప్రోబ్లం వలన, మూడు పూటలా మూడుసార్లు 90ML తాగాలి. ఈ విషయమే ఆయన ప్రేమను .. పెళ్లిని ఎలాంటి మలుపులు తిప్పిందనేదే కథ అనే సంగతి ఈ ట్రైలర్ చెబుతోంది.

Leave a Reply