‘కమ్మ రాజ్యంలో కడప రెడ్లు’ నుంచి క్యాస్ట్ ఫీలింగ్ సాంగ్

kamma rajyamlo kadapa redlu caste feeling song
Share Icons:

హైదరాబాద్:

వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఏం చేసిన వివాదమే. అయిన ఎలాంటి సినిమా తీసిన వివాదం ఉండాల్సిందే. తాజాగా ఆయన మరొక వివాదాస్పద సినిమాని తీస్తున్నారు. ఇక తాను నూతనంగా నిర్మిస్తున్న ‘కమ్మ రాజ్యంలో కడప రెడ్లు’ చిత్రంలోని ‘క్యాస్ట్ ఫీలింగ్’ సాంగ్ ను రామ్ గోపాల్ వర్మ కొద్దిసేపటి క్రితం విడుదల చేశారు.

“కమ్మలు… కాపులు… రెడ్లు… రాజులు… వైశ్యులు…” అంటూ ఈ పాట మొదలవుతుంది. “నేను, నా దేశం నా ఊరు, నా కుటుంబం… నా మతమూ, నా స్నేహితులు, నా బంధువులు, నా పిల్లలు… ఈ ఫీలింగ్ లన్నీ కరెక్టయినపుడు, క్యాస్ట్ ఫీలింగ్ ఎందుకు తప్పు? దేనికిరా… ఈ హిపోక్రసీ? ఎందుకురా… ఈ హిపోక్రసీ? అంటూ పాట సాగుతుంది.

దేశాన్ని కీర్తిస్తే దేశ భక్తి అయినప్పుడు, కులాన్ని కీర్తించే కుల భక్తి ఎందుకు తప్పని ప్రశ్నించారు. ఈ పాటకు ముందు క్యాస్ట్ ఫీలింగ్ పై వర్మ సెటైర్లు కూడా వేశారు. మీడియాలో వచ్చే స్లోగన్స్ ను ప్రస్తావిస్తూ, విరుచుకుపడ్డారు. ఈ పాట సినిమాలో సందర్భానుసారంగా వస్తుందని వెల్లడించారు.

Leave a Reply