అమరావతి తరలింపుని బీజేపీ ఆపేస్తుంది…

Share Icons:

అమరావతి: అమరావతి రైతులకు మాజీ మంత్రి కామినేని శ్రీనివాస్ సంఘీభావం తెలియజేశారు. రాజధాని అంశాన్ని త్వరలో కేంద్రం దృష్టికి తీసుకెళ్తామని ఆయన వెల్లడించారు. రాజధానిపై కేంద్రం సరైన సమయంలో స్పందిస్తుందని, రాజధాని తరలిపోకుండా బీజేపీ ఆపగలదని పేర్కొన్నారు. రాజధానిని తరలిస్తే ఇక్కడి భవనాలను ఏం చేస్తారని ప్రశ్నించారు. బీజేపీ, జనసేన రాజధాని విషయంలో సంయుక్త కార్యాచరణ ప్రకటించాయని కామినేని స్పష్టం చేశారు.

ఇదిలా ఉంటే రాజధానిగా అమరావతిని కొనసాగించాలని రాజధాని ప్రాంత ప్రజలు ఆందోళనలు చేస్తున్నారు. ఇక ఏపీ సర్కార్ మాత్రం మూడు రాజధానులకే కట్టుబడి ఉన్నట్టు తెలుస్తుంది. ఉగాది నుండి సీఎం క్యాంపు కార్యాలయాన్ని విశాఖ నుండి నిర్వహిచాలని సన్నాహాలు చేస్తున్నారు. రాజధాని అన్న ఊసు లేకుండా విశాఖ నుండి పాలన సాగించాలని ప్రయత్నం చేస్తున్నారు సీఎం జగన్ . ఇక మూడు రాజధానుల నిర్ణయానికి తగ్గట్టుగా పరిపాలనా వికేంద్రీకరణ వైపు అడుగులు వేస్తున్న జగన్ రాజధాని తరలింపు, కార్యాలయాల తరలింపు అధికారికంగా మొదలు పెట్టేశారు .

తాజాగా కర్నూలుకు రాష్ట్ర విజిలెన్స్ కమిషన్, కమిషనరేట్ ఆఫ్ ఎంక్వైరీస్ కార్యాలయాల్ని వెలగపూడి నుండి తరలించాలని ఆదేశాలు జారీ చేసింది . ఇకపై ఆ కార్యాలయాలు కర్నూలు నుండి పనిచేయనున్నాయి. న్యాయ రాజధానిగా కర్నూలును ప్రకటించిన ప్రభుత్వం ఆ దిశగా అడుగులు వెయ్యటం , విశాఖ నుండి పాలన చెయ్యాలనుకోవటం వంటి అంశాలు ఇప్పుడు రాజధాని ప్రాంత వాసులకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. ఇక ఈ నేపధ్యంలో మరోమారు కోర్టు మెట్లెక్కారు రాజధాని రైతులు .

వెలగపూడిలో ఉన్న కార్యాలయాల తరలింపుపై హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు . విజిలెన్స్ కమిషన్, కమిషనరేట్ ఆఫ్ ఇంక్వైరీస్ కార్యాలయాలను.. కర్నూలు తరలించడాన్ని సవాల్ చేస్తూ హైకోర్టులో రైతులు పిటిషన్ దాఖలు చేశారు.

 

Leave a Reply