బెదిరింపులకు భయపడను అంటున్న కమల్…

Share Icons:

 

చెన్నై, 17 మే:

ఎం‌ఎన్‌ఎం అధినేత కమల్ హాసన్ చుట్టూ వివాదాలు తిరుగుతూనే ఉన్నాయి. ఇటీవల భారత దేశంలో గాడ్సే తొలి హిందూ ఉగ్రవాది అంటూ కమల్ హాసన్ చేసిన వ్యాఖ్యలపై చెలరేగిన వివాదం ఇంకా కొనసాగుతూనే ఉంది.

కమల్ చేసిన వ్యాఖ్యలపై పలు చోట్ల హిందువులు తమ నిరసనలని వ్యక్తం చేస్తూనే ఉన్నారు. ఈ క్రమంలోనే ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు ఎన్నికల ప్రచారంలో ఉన్న కమల్‌పై కోడిగుడ్లు, రాళ్లు విసిరారు.

రాళ్లు విసిరిన ఇద్దర్నీ కమల్ హాసన్ అభిమానులు చితకబాదబోతుంటే… అడ్డుకున్న పోలీసులు వాళ్లిద్దర్నీ అదుపులోకి తీసుకున్నారు. ఇక ఈ దాడులపై కమల్ మాట్లాడుతూ… ఎవరు ఎన్ని రకాలుగా బెదిరించినా తాను బెదిరేది లేదన్నారు.  అయితే అన్ని మతాల్లోనూ ఉగ్రవాదులు, అతివాదులూ ఉన్నారని చరిత్ర చెబుతోందని తెలిపారు. తాను ముస్లింలు, క్రైస్తవులు, హిందువులకు చేరువవుతున్నానని అన్నారు.
ఇదివరకు కూడా గాడ్సేపై ఇదే అభిప్రాయాన్ని చెప్పానన్నారు. ఈసారి మాత్రమే తన వ్యాఖ్యలు దుమారం రేపాయన్నారు.

తనను అరెస్టు చేస్తారన్న భయం లేదని, తనపై జరుగుతున్న కుట్రల వెనక ప్రభుత్వ హస్తం ఉండి ఉండొచ్చనీ అనుమానం వ్యక్తం చేశారు.

మామాట: ఈ వివాదం ఎప్పటి వరకు కొనసాగుతుందో

Leave a Reply