‘ఎన్టీఆర్’ సినిమా కల్యాణ్‌రామ్ ఫ్రీగా చేశాడా….!

Share Icons:

హైదరాబాద్, 27 ఫిబ్రవరి:

ఎన్టీఆర్ జీవిత చరిత్ర ఆధారంగా రెండు భాగాలుగా తెరకెక్కిన చిత్రాలు కథానాయకుడు, మహానాయకుడు… ఈ రెండు చిత్రాలు బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టి డిస్ట్రిబ్యూటర్లకి నష్టాలు తీసుకొచ్చాయి.

ఇదిలా ఉంటే ఈ చిత్రంలో నందమూరి కల్యాణ్ రామ్..తన తండ్రి హరికృష్ణ పాత్రలో నటించారు. ఇక ఈ సినిమా వేడుకలలోను, ప్రమోషన్స్ లోను చురుకుగా పాల్గొన్నాడు. ప్రస్తుతం హీరోగా బిజీగా వున్న ఆయన, ఎన్టీఆర్ బయోపిక్ షూటింగును బట్టి, తాను చేస్తోన్న మరో సినిమా డేట్స్ మార్చుకుంటూ వచ్చాడు.

అలా బాలకృష్ణ సినిమాకి తొలి ప్రాధాన్యతనిస్తూ ఆయన 25 రోజుల పాటు షూటింగులో పాల్గొన్నాడట. అందువల్లనే బాలకృష్ణ .. కల్యాణ్ రామ్ ను ప్రత్యేకించి పిలిపించి పారితోషికం తీసుకోమని చెప్పారట.

అయితే ‘నేను నటించింది మా బాబాయ్ సినిమాలో .. పోషించింది మా నాన్నగారి పాత్ర. అలాంటప్పుడు ఈ సినిమాకి పారితోషికం ఎలా తీసుకుంటాను?’ అంటూ ఆయన సున్నితంగా తిరస్కరించాడట. బాబాయ్ బాలకృష్ణ ఎంతగా బలవంతం చేసినా కల్యాణ్ రామ్ తీసుకోలేదని సమాచారం.

మామాట: అలాగే నష్టపోయిన డిస్ట్రిబ్యూటర్లకి డబ్బులు తిరిగి ఇచ్చేస్తే బాగుంటుందేమో

Leave a Reply