కల్యాణ్ రామ్ కొత్త సినిమా లోగో విడుదల….

kalyan ram new movie title logo released
Share Icons:

హైదరాబాద్:

 

నందమూరి కల్యాణ్ రామ్ హీరోగా….సతీశ్ వేగేశ్న  దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. మెహరీన్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రం ద్వారా ప్రముఖ ఆడియో కంపెనీ ఆదిత్య మ్యూజిక్ అధినేత ఉమేష్ గుప్తా నిర్మాణ రంగంలోకి ప్రవేశిస్తున్నారు.

 

ఇటీవలే ప్రారంభమైన ఈ చిత్రం ప్రస్తుతం షూటింగ్ దశలో వుంది. ఇక ఈ రోజు క‌ళ్యాణ్ రామ్ బ‌ర్త్‌డే సంద‌ర్భంగా చిత్ర టైటిల్‌ లోగోని వీడియో ద్వారా విడుదల చేశారు. ‘ఎంత మంచివాడ‌వురా’ అనే టైటిల్‌ని చిత్రానికి ఖరారు చేశారు. అయితే ఇందులో క‌ళ్యాణ్ రామ్ లుక్‌ని బయటపెట్టలేదు.

 

కాగా ఈ సినిమాతో పాటు కల్యాణ్‌రామ్ మరో చిత్రాన్ని అంగీకరించినట్లు తెలిసింది. ఈ సినిమా ద్వారా మల్లిడి వశిష్ట దర్శకుడిగా పరిచయం కానున్నట్లు తెలుస్తున్నది. సరికొత్త నేపథ్యంలో విభిన్నమైన పాత్ర చిత్రణతో సాగే ఈ చిత్రానికి రావణ అనే టైటిల్‌ని చిత్ర బృందం పరిశీలిస్తున్నట్లు తెలిసింది.

 

 

ఇక ఓ ప్రముఖ నిర్మాణ సంస్థ నిర్మించనున్న ఈ చిత్రానికి సంబంధించిన అధికారిక ప్రకటన త్వరలోనే వెలువడనున్నట్లు చిత్ర వర్గాల సమాచారం.

 

Leave a Reply