మార్చి 1న రానున్న ‘118’

Share Icons:

హైదరాబాద్, 11 జనవరి:

ఎన్టీఆర్ బయోపిక్‌లో తన తండ్రి హరికృష్ణ పాత్రలో అలరించిన కల్యాణ్ రామ్ మరో సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. కల్యాణ్ రామ్ హీరోగా, గుహన్ దర్శకత్వంలో ‘118’ని ఈ సినిమాను తెరకెక్కించారు.

ఇప్పటికే ఈ సినిమా చాలావరకూ చిత్రీకరణను పూర్తిచేసుకుంది. నివేదా థామస్ .. షాలినీ పాండే కథానాయికలుగా నటిస్తోన్న ఈ సినిమాలో, కల్యాణ్ రామ్ డిఫరెంట్ లుక్ తో కనిపించనున్నాడు.

మహేశ్ కోనేరు నిర్మిస్తోన్న ఈ సినిమాను మార్చి 1వ తేదీన విడుదల చేయనున్నారు. అయితే చాలరోజులుగా హిట్ లేని కల్యాణ్ రామ్…ఈ సినిమాతో అయినా హిట్ కొడతాడేమో చూడాలి.

మామాట: ఈ సినిమాతో కల్యాణ్ ఫామ్‌లోకి వస్తాడేమో చూడాలి… 

Leave a Reply