కాజల్‌కి ఆ క్రికెటర్ అంటే పిచ్చి అంటా…!

Share Icons:

హైదరాబాద్, 30 ఏప్రిల్:

టాలీవుడ్‌లోనే కాకుండా…కొలీవుడ్, బాలీవుడ్‌ల్లో సైతం టాప్ హీరోయిన్ సాగుతున్న కాజల్…..తనకి ఇష్టమైన క్రికెటర్ ఎవరో చెప్పింది.

తాజాగా ఓ ఇంట‌ర్వ్యూ ఇచ్చిన కాజ‌ల్ త‌న‌కు న‌చ్చిన క్రికెటర్ గురించి మాట్లాడింది. `మీకు న‌చ్చిన ఆట‌గాడు ఎవరు` అనే ప్ర‌శ్న‌కు కాజ‌ల్ స‌మాధాన‌మిచ్చింది. `తనకు రోహిత్ శ‌ర్మ అంటే చాలా ఇష్టమని, ఒక‌ప్పుడు ఆయ‌న‌పై క్రష్ ఉండేదని ఓపెన్ అయిపోయింది. రోహిత్ ఆట‌తీరు, ప్ర‌వ‌ర్త‌న తనని క‌ట్టిప‌డేసేవని, అతని బ్యాటింగ్ స్కిల్స్ అద్భుతం` అంటూ కాజ‌ల్ చెప్పుకొచ్చింది.

తెలుగులో దాదాపు అగ్ర‌హీరోలంద‌రి స‌ర‌స‌నా న‌టించిన కాజల్…. ప్ర‌స్తుతం బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా ద‌ర్శ‌కుడు తేజ తెర‌కెక్కిస్తున్న `సీత‌` సినిమాలో న‌టిస్తోంది. ఇటీవ‌ల విడుద‌లైన ఈ చిత్ర టీజ‌ర్‌కు మంచి స్పంద‌న ల‌భించింది.అలాగే క‌మ‌ల్ హాస‌న్ స‌ర‌స‌న `భార‌తీయుడు-2`లోనూ, `పారిస్ పారిస్‌` సినిమాలోనూ నటిస్తోంది.

మామాట: ఊహించని ఆటగాడి పేరే చెప్పింది…

Leave a Reply