బాబుకు షాక్ ఇవ్వనున్న ‘పులివెందుల రౌడీలు-కడప గూండాలు’

tdp president chandrababu sensational comments on boston consultancy
Share Icons:

అమరావతి: టీడీపీ అధినేత చంద్రబాబు ప్రతిపక్షంలోకి వచ్చిన దగ్గర నుంచి జగన్‌పై విమర్శలు చేస్తూ, ప్రతిసారి పులివెందుల రౌడీలు, కడప గూండాలు అంటూ విమర్శలు చేస్తున్న విషయం తెలిసిందే. అయితే ఇవే మాటలు కడప టీడీపీ నేతలని బాగా హర్ట్ చేస్తున్నట్లు కనిపిస్తున్నాయి. అందుకే వరుసగా కడప జిల్లా నేతలు వైసీపీలోకి వెళ్లిపోతున్నారు. ఇప్పటికే మాజీ మంత్రి రామసుబ్బారెడ్డి, పాలకొండ్రాయుడులు వైసీపీలో చేరేందుకు సిద్ధమవ్వగా, తాజాగా పులివెందులకు చెందిన సతీశ్ రెడ్డి కూడా వైసీపీలోకి వెళ్లనున్నారని తెలుస్తోంది.

ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సొంత నియోజకవర్గం పులివెందులలో తెలుగుదేశం పార్టీకి ఉన్న ఏకైక పెద్ద దిక్కు సతీష్ రెడ్డి. పార్టీ నుంచి ఎలాంటి అండ లేనప్పటికీ.. దశాబ్దాలుగా వైఎస్ కుటుంబంతో తలపడుతున్నారు. ఎప్పుడు అసెంబ్లీ ఎన్నికలు జరిగినా టీడీపీ అభ్యర్థిగా పులివెందుల నుంచి పోటీ చేయడం ఆయన ఆనవాయితీ. నియోజకవర్గంలో పార్టీని బలోపేతం చేయడానికి ఆయన చేయని ప్రయత్నమంటూ లేదు. చంద్రబాబుకు అత్యంత నమ్మకస్తుడిగా ఉన్న సతీష్ రెడ్డి.. టీడీపీలో కొనసాగాలా? వద్దా? అనే విషయంపై పునరాలోచిస్తున్నారని అంటున్నారు.

రాష్ట్రంలో ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటన చోటు చేసుకున్నప్పటికీ.. దాన్ని పులివెందుల, కడప జిల్లాకు అపాదిస్తూ వస్తున్నారు టీడీపీ నాయకులు. దీనికి చంద్రబాబు గానీ, మాజీమంత్రి నారా లోకేష్ గానీ మినహాయింపు కాదు. మొన్నటికి మొన్న విశాఖపట్నం విమానాశ్రయం వద్ద చంద్రబాబుపై చోటు చేసుకున్న దాడి కూడా పులివెందుల గూండాలు, రౌడీల పనేనంటూ ఆరోపణలు గుప్పించారు. ఇలాంటి వ్యాఖ్యల పట్ల పులివెందులకు చెందిన టీడీపీ నాయకులు స్థానికుల నుంచి కొంత ప్రతిఘటనను ఎదుర్కొంటున్నారనే వార్తలు ఉన్నాయి.

ఇలాంటి వ్యాఖ్యల పట్ల తాము ఇబ్బందులు పడుతున్నామనే విషయాన్ని సతీష్ రెడ్డి సహా స్థానిక నాయకులు కొందరు పార్టీ అగ్ర నాయకత్వం దృష్టికి తీసుకెళ్లినప్పటికీ.. ఫలితం కనిపించలేదని అంటున్నారు. పైగా- విశాఖపట్నం ఘటన తరువాత ఈ రకమైన వ్యాఖ్యానాలు మరింత తీవ్రరూపం దాల్చడంతో సతీష్ రెడ్డి మనస్తాపానికి గురయ్యారని, తాను చేస్తోన్న ముందస్తు హెచ్చరికలను పార్టీ సీనియర్లు పెడచెవిన పెడుతున్నారనే ఆవేదన ఆయనలో వ్యక్తమౌతోందని చెబుతున్నారు. ఈ పరిస్థితుల్లో పార్టీలో కొనసాగటం వల్ల ఉపయోగం లేదనే అభిప్రాయానికి వచ్చారని సమాచారం.

 

Leave a Reply