కడప స్టీల్ ఫ్యాక్టరీ నిర్మాణం పూర్తయ్యేది అప్పుడే…

Share Icons:

కడప, 11 జూన్:

త్వరలోనే కడప జిల్లాలో స్టీల్ ఫ్యాక్టరీకి ఏపీ ముఖ్యమంత్రి జగన్ శంకుస్థాపన చేస్తారని కడప ఎంపీ అవినాష్ రెడ్డి తెలిపారు. ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ… రాయలసీమ వాసుల చిరకాల కోరిక కడప ఉక్కు ఫ్యాక్టరీ నిర్మాణాన్ని మూడేళ్లలోనే పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు.

కేవలం మూడేళ్ల కాలంలో ఈ ఫ్యాక్టరీ నిర్మాణాన్ని పూర్తిచేసి ఉత్పత్తిని ప్రారంభిస్తామని, దీనివల్ల రాష్ట్రంలో 20,000 నుంచి 25 వేల ఉద్యోగాలు వస్తాయని చెప్పారు. అటు ఏపీకి ప్రత్యేకహోదా కోసం పార్లమెంట్‌లో తమ గళం గట్టిగా వినిపిస్తామని అన్నారు. ఇక జిల్లాకు సాగు, తారునీరు అందించే గండికోట రిజర్వాయర్ నీటి నిల్వ సామర్థ్యాన్ని 12 నుంచి 26 టీఎంసీలకు పెంచుతామని,

ఇదిలా ఉంటే టీడీపీ ప్రభుత్వం చంద్రబాబు..ఎన్నికలకు ముందు స్టీల్ ఫ్యాక్టరీకి శంఖుస్థాపన చేశారు. అయితే ఎన్నికల్లో టీడీపీ ఓడిపోవడంతో…ఇప్పుడు ఆ బాధ్యతని వైసీపీ ప్రభుత్వం తీసుకుంది.

Leave a Reply