భయ పెడుతున్న డెంగీ

kadapa-dengue -deaths-raise
Share Icons:

కడప, సెప్టెంబర్ 09,

కడప జిల్లాలో డెంగీ జ్వరం భయపెడుతోంది. వైద్య ఆరోగ్యశాఖ లెక్కల ప్రకారం గత ఏడాది 449 మందిలో డెంగీ లక్షణాలు కన్పించాయి. వీరిలో 322 మందికి వ్యాధి నిర్ధారణ అయ్యింది. ఈ ఏడాది ఇప్పటి వరకు 134 మంది డెంగీ వ్యాధి లక్షణాలతో బాధపడగా అందులో ఐదుగురికి వ్యాధి ఉన్నట్లు ఎలీసా టెస్ట్‌లో బయటపడింది. జిల్లాలో 87 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, 18 కమ్యూనిటీ హెల్త్‌ సెంటర్లతో పాటు కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాల, ఆదోని, ఎమ్మిగనూరు ఏరియా ఆసుపత్రులు, నంద్యాల జిల్లా ఆసుపత్రి ఉన్నాయి. ఇవి గాక 800 దాకా ప్రైవేటు నర్సింగ్‌ హోమ్‌లు, క్లినిక్‌లు నిర్వహిస్తున్నారు. ఈ ఆసుపత్రుల్లోని వైద్యుల వద్దకు ప్రస్తుతం వస్తున్న రోగుల్లో జ్వరపీడితుల సంఖ్య ఎక్కువగా ఉంటోంది. ఇదే క్రమంలో మలేరియా, డెంగీ కేసులూ ఎక్కువ అవుతున్నాయి. ప్రతి సంవత్సరం ఈ కేసులు పక్కనున్న అనంతపురం, కడప  జిల్లాల నుంచి అధికంగా కర్నూలులోని ఆసుపత్రులకు వచ్చేవి. ఈసారి ఆయా జిల్లాలతో పాటు జిల్లాలోని రోగులూ ఆసుపత్రుల్లో చేరుతున్నారు. జిల్లాలోనూ మలేరియా కేసులు సైతం ఎక్కువగానే నమోదవుతున్నాయి. గత ఏడాది 91మందికి మలేరియా నిర్ధారణ అయ్యింది.

ఈసారి ఇప్పటి వరకు 37 మందిలో గుర్తించారు. ఇందులో ప్రమాదకరమైన పాల్సీఫారమ్‌ మలేరియా తొమ్మిది మందికి ఉన్నట్లు గుర్తించారు. ఐదులో ఒకటి గత నెల, మిగిలినవి జనవరి నుంచి ఏప్రిల్‌ మధ్యలో నమోదైనట్లు అధికారులు చెబుతున్నారు. కర్నూలు నగరంతో పాటు కల్లూరు, నన్నూరు, కడుమూరు, ప్రాతకోట, కొత్తబురుజు, క్రిష్ణగిరి, పుచ్చకాయలమడ, నందవరం, శిరువెళ్ల, నంద్యాల అర్బన్‌ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల పరిధిలో ఈ కేసులు నమోదు కాగా, కర్నూలులో అత్యధికంగా కేసులు నమోదువుతున్నాయి. అటు ప్రభుత్వ, ఇటు ప్రైవేటు ఆసుపత్రుల్లో ర్యాపిడ్‌ టెస్ట్‌ ద్వారా డెంగీ నిర్ధారణ కాగానే చికిత్స ప్రారంభిస్తున్నారు. వైద్య, ఆరోగ్యశాఖ మాత్రం ర్యాపిడ్‌ టెస్ట్‌లోపాజిటివ్‌రిపోర్ట్‌ వస్తే తమకు సమాచారం అందించాలని, ఈ మేరకు రక్తం సీరా తీసి కర్నూలు మెడికల్‌ కళాశాలలోని మైక్రోబయాలజీ ల్యాబ్‌కు పంపితే అసలు డెంగీనో, కాదో నిర్ధారణ చేస్తామని చెబుతోంది.

ఇక్కడి నివేదిక ఆధారంగా మాత్రమే డెంగీగా ప్రకటించాలని ఆసుపత్రులకు స్పష్టం చేస్తోంది. అయితే.. కేఎంసీలోని ల్యాబ్‌కు వెళ్లి రిపోర్ట్‌ రావాలంటే 15 నుంచి 30 రోజులు పడుతుందని, ఈలోగా రోగికి చికిత్స చేయకుండా ఆపాలా అంటూ వైద్యులు ప్రశ్నిస్తున్నారు. వైద్య,ఆరోగ్యశాఖ ఆదేశాలతో నిమిత్తం లేకుండా వారు డెంగీ లక్షణాలున్న వారికి చికిత్స అందిస్తున్నారు. మరికొందరు ప్రైవేటు వైద్యులు మాత్రం సాధారణ జ్వరానికి సైతం డెంగీ పేరు చెప్పి దోచుకుంటున్నారన్న ఆరోపణలున్నాయి.

వ్యాధి లక్షణాలు..

తీవ్రమైన తలనొప్పి, కళ్లు, కండరాలు, కీళ్లనొప్పులు ఉంటాయి. ఒంటిపై ఎర్రటి దురదలు కనిపిస్తాయి. ముక్కు, చిగుళ్లలో రక్తం స్రవిస్తుంది.

మామాట : సామాన్యుల ఆరోగ్యం పట్టించుకోని పాలకుల చిత్తశుద్ధి ఏమిటో

Leave a Reply