ప్రతి కుక్కకు ఓ రోజు వస్తుందంటే ఇదేనా..? ‘కాలా’ కుక్క విలువ 2 కోట్లు..!!

Share Icons:

హైదరాబాద్, 8 మార్చి:

‘కాలా’ సినిమాలో టైటిల్ కి తగినట్టుగానే రజనీకాంత్ పవర్ఫుల్ డాన్ గా కనిపించనున్నారు. ఈ సినిమాలో ఆయన పెంపుడు జంతువుగా ‘మణి’ అనే ఓ కుక్క నటించింది. పోస్టర్స్ లోను ఈ కుక్కను హైలైట్ చేశారు.

దాంతో ఇప్పుడు ఈ కుక్కకి క్రేజ్ పెరిగిపోయింది .. దాని దశ తిరిగిపోయింది. రజనీకాంత్ తో కలిసి నటించడం వలన ఈ కుక్కకి భారీస్థాయిలో డిమాండ్ పెరిగిపోయింది. దాంతో దానిని దక్కించుకోవడానికి చాలామంది పోటీపడుతున్నారని ట్రైనర్ ‘సిమన్’ చెబుతున్నాడు.

kaala dog

సూపర్ స్టార్ రజినీకాంత్ నటించిన తాజా చిత్రం కాలా. ఈ చిత్రంలో రజినీ డాన్ పాత్రలో నటిస్తున్నాడు. కబాలి ఫేమ్ రంజిత్ ఫా ఈ చిత్రానికి దర్శకుడు.బాలీవుడ్ బ్యూటీ హ్యూమా క్యురేషి ఈ చిత్రంలో హీరోయిన్ గా నటిస్తోంది. ప్రముఖ నటుడు నానా పాటేకర్ ప్రతినాయకుడిగా నటిస్తున్నారు.

నలుపు దుస్తులలో కనిపిస్తున్నా రజిని ఎప్పటిలాగే స్టైల్‌తో అదరగొట్టేశాడు. ఇటీవల విడుదలైన టీజర్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది.కాగా ఈ చిత్ర పోస్టర్స్‌లో రజినీకాంత్ పక్కన ఉన్న కుక్క ఆసక్తిని రేకెత్తిస్తోంది. కాలా చిత్రంలో రజినీకాంత్ పక్కన కనిపించడంతో ఈ కుక్క దశ తిరిగిపోయింది.

ఈ కుక్కని రూ 2 కోట్లు వెచ్చించి కొనుక్కునేందుకు చాలా మంది ఆసక్తి చూపిస్తున్నారని ట్రైనర్ సిమన్ తెలిపాడు. సినిమాలకి అవసరమైనప్పుడు ఆయన కావలసిన కుక్కలను తీసుకొచ్చి.. వాటితో నటింపజేస్తుంటాడు.

తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ .. “చెన్నైలోని ఓ రోడ్ పైన ‘మణి’ దొరికింది . . చాలా కుక్కలను పరిశీలించిన తరువాత దర్శకుడు రంజిత్ ఈ కుక్కను ఓకే చేశాడు. కానీ ఈ కుక్కని తాను అమ్మదలుచుకోలేదని ప్రకటించాడు.

ఇప్పుడు ఈ కుక్కను కొనడానికి 2 కోట్ల నుంచి 3 కోట్ల వరకూ ఇస్తామంటూ ఆఫర్లు వస్తున్నాయి. కానీ నేను దీనిని అమ్మదలచుకోలేదు .. ఎందుకంటే నేను దీన్ని ఓ బిడ్డలా చూసుకుంటున్నాను” అని ఆయన చెప్పుకొచ్చాడు.ఈ కుక్కంటే రజినీకాంత్‌కు కూడా చాలా ఇష్టం అని సిమన్ తెలిపారు. షూటింగ్‌కు వచ్చే ప్రతిరోజు రజిని ఈ కుక్క కోసం ప్రత్యేకమైన బిస్కెట్లు తీసుకుని వచ్చేవారని సిమన్ తెలిపారు.

మామాట: రజనీకాంత్ పక్కన నటిస్తే ఎవరికైనా దశ తిరగాల్సిందే…

English Summary: Recall the dog from Pa Ranjith’s Kaala that worked with Rajinikanth and appeared posing alongside Rajinikanth in the posters? Well, he is worth a couple of crores now. Mani is his name and is being brought up like his own child by the trainer Simon.

Leave a Reply