2014లో నేను మద్ధతు ఇవ్వడం వల్లే మోదీ ప్రధాని అయ్యారు

Share Icons:

విజయవాడ, 10 జనవరి:

2014లో తాను మద్దతు ఇవ్వడం వల్లే మోదీ ప్రధాని అయ్యారని, మోదీయే తన వద్దకు వచ్చి అడగడం, సెక్యులరిజం అని చెప్పడంతో ప్రచారం చేశానని  ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ అన్నారు. ఈరోజు ఆయన విజయవాడలో మీడియాతో మాట్లాడుతూ… “మీరు బీసీ, నేను బీసీ. నాకు ఫ్యామిలీ లేదు. మీకూ ఫ్యామిలీ లేదు. దేశమే మన ఫ్యామిలీ. ఇద్దరం కలిసి దేశాన్ని అభివృద్ధి చేద్దాం” అని  గంటా నలభైఐదు నిమిషాలపాటు తనతో మోడీ చర్చించరని చెప్పారు. అలాగే బీజేపీ ప్రెసిడెంట్లు, సెక్రెటరీలు, ట్రెజరర్లు.. ఇలా అందరినీ అమెరికా పంపించి.. మసాజ్ చేసి.. రిక్వెస్ట్ చేసి.. ఇది చేసి, అది చేసి తనని ఎంతగానో వేడుకున్నారని, ఒక చిన్న కుర్రాడిలా మోదీ బిహేవ్ చేశారని తెలిపారు.

అయితే 2013 అక్టోబర్ 1న ఆడ్వాణీ చేతులు జోడించి గంటన్నరపాటు మోదీకి సపోర్ట్ చేయొద్దని,  అతను ఒక్క హామీని కూడా నెరవేర్చడని చెప్పారని కేఏ పాల్ వెల్లడించారు.

మామాట: అంతే అంటారు…

Leave a Reply