కేంద్ర ఎన్నికల సంఘానికి  కే ఏ పాల్   ప్రశ్నలు…?

Share Icons:

కొత్త ఢిల్లీ, ఏప్రిల్ 17,

తొలిదశ ఎన్ననికల్లో భాగంగా గత 11 వ తేదీన ఏపీ లో జరిగిన పోలింగ్ పై పాల్ పలు ప్రశ్నలు లేవనెత్తారు.  వీటికి కేంద్ర ఎన్నికల సఘం సమాధానమివ్వాలన్నారు. అవసరమైతే ఈసీ వ్యవహార శైలిపై కోర్టుకు వెళతామనికూడా పాల్ ప్రకటించారు. కే ఏ పాల్ సంధించిన ప్రశ్నలు… కేంద్ర ఎన్నికల సంఘం సమాధానం చెప్పగలదా?

1.పోలింగ్ ఆలస్యానికి బాధ్యులు ఎవరు?

2.నూటికి 80 శాతం ఈవీఎంలు ఎందుకు పనిచెయ్యలేదు?

3.పోలింగ్ ప్రక్రియను రాత్రిలోపు ముగించకుండా… మర్నాడు మధ్యాహ్నం వరకూ ఎందుకు కొనసాగించారు?

4.పోలీసులు ఎందుకు సరిపోలేదు?

5.ఈవీఎంలో 12వ బటన్ నొక్కితే, 2వ బటన్‌కు ఓటుపడుతూ… వీవీప్యాట్ స్లిప్పు 3 సెకండ్లు మాత్రమే ఎందుకు కనపడుతోంది?

6.ఓటర్ల నుంచీ కంప్లైంట్లను లిఖిత పూర్వకంగా ఎందుకు తీసుకోలేదు?

7.పోలింగ్ అబ్జర్వర్లుగా దక్షిణాది వారిని కాకుండా ఉత్తరాది వారిని ఎందుకు నియమించారు?

ఈ ప్రశ్నలన్నింటికీ కేంద్ర ఎన్నికల సంఘం, రాష్ట్ర ఎన్నికల సంఘం నుంచీ లిఖిత పూర్వకంగా సమాధానం తీసుకోవాలన్నారు కేఏ పాల్. ఢిల్లీ వెళ్లిన ఆయన… జాతీయ పార్టీల నేతలను కలుస్తూ బీజేపీకి వ్యతిరేకంగా మద్దతు కూడగడుతున్నారు. గురువారం లేదా శుక్రవారం సుప్రీంకోర్టుకు వెళ్తామన్న ఆయన… మూడో దశ నుంచీ ఎన్నికల్ని రద్దు చేయించేందుకు ప్రయత్నిస్తున్నట్లు తెలిపారు.

బీజేపీ తిరిగి అధికారంలోకి వచ్చేందుకు ఎన్నికల్లో అక్రమాలకు పాల్పడుతోందని ఆరోపించారు. తమకు కాంగ్రెస్, ఎస్పీ, బీఎస్పీ, తృణమూల్ కాంగ్రెస్, డీఎంకే, జేడీఎస్ తదితర పార్టీల మద్దతు ఉందన్నారు. ఎన్నికలు రద్దు అయ్యేలా ప్రజలంతా పోరాడాలని   ప్రజా శాంతి పార్టీ అధ్యక్షుడు కే ఏ పాల్ కోరడం విశేషం.

మామాట: మాకైతే ఏ అనుమానమూ లేదు పాల్జీ…

Leave a Reply