నర్సాపురం బరిలో కెఏ పాల్…

Share Icons:

ఏలూరు, 19 మార్చి:

ఎప్పటికప్పుడు సంచలన ప్రకటనలతో అందర్నీ ఆకర్షిస్తున్న ప్రజాశాంతి పార్టీ అధినేత కే ఏ పాల్… తాజాగా నర్సాపురం ఎంపీ స్థానం నుంచీ తాను పోటీ చేయబోతున్నట్లు ప్రకటించారు. తాను మాత్రమే కాకుండా… తన పార్టీలో అభ్యర్థులందర్నీ బ్రహ్మాండమైన మెజార్టీతో గెలిపించి  ప్రపంచం ఆశ్చర్యపోయేలా చేస్తానని ఆయన చెబుతున్నారు. కే ఏ పాల్ ప్రకటనతో… ఇప్పుడు నర్సాపురం నియోజక వర్గం హాట్ టాపిక్ అయ్యింది.

ప్రస్తుతం నర్సాపురం లోక్ సభ స్థానానికి టీడీపీ నుంచీ వెంకట శివరామ రాజు బరిలో దిగగా… వైసీపీ నుంచీ రఘురామ కృష్ణంరాజు పోటీ చేస్తున్నారు. పోటీ వీళ్లిద్దరి మధ్యే ఉంటుందని అంతా చెప్పుకుంటున్నారు. కే ఏ పాల్ మాత్రం… అసలు వీళ్లు తనకు పోటీయే కాదన్నట్లు మాట్లాడున్నారు. తమ హెలికాప్టర్ గుర్తుతో అద్భుతాలు సృష్టిస్తామని అంటున్నారు. నర్సాపురంలో తన అభిమానుల కోరిక మేరకు… అక్కడి నుంచీ పోటీ చేస్తున్నానని తెలిపారు. ఏలూరు, కాకినాడ, విశాఖపట్నం లోక్ సభ స్థానాలను కూడా పరిశీలనలోకి తీసుకున్నానన్న ఆయన… చివరకు నర్సాపురంనే ఎంపిక చేసుకున్నాని వివరించారు.

మామాట: రాజకీయాల్లో కామెడీ ఉండాల్సిందేనా

Leave a Reply