ఏపీ రాజకీయాలపై కే‌ఏ పాల్ కామెంట్: జగన్‌కు ఆఫర్..పవన్‌పై సెటైర్…

Share Icons:

హైదరాబాద్: 2019 ఏపీ సార్వత్రిక ఎన్నికల్లో హడావిడి చేసిన ప్రజాశాంతి అధ్యక్షుడు కే‌ఏ పాల్ మరోసారి తెరపైకి వచ్చి తాజాగా ఏపీ లో జరుగుతున్న రాజకీయ పరిణామాలపై స్పందించారు.  రైతులకు ఇబ్బందులు జరుగుతున్నాయని.. ధర్నాలు చేస్తే సమస్యలు పోవు అంటున్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్‌‌మోహన్‌రెడ్డికి.. ఆయన స్నేహితుల ద్వారా తాను ఓపెన్ ఆఫర్ ఇచ్చానని చెప్పుకొచ్చారు. వారు ఆహ్వానిస్తే.. తనకు ఉన్న పరిచయాలతో రాష్ట్ర అభివృద్ధికి కృషిచేస్తాను అన్నారు.

మూడు నెలల నుంచి ఆరు నెలల్లో.. ఆయన్ను కలిసి.. ఆహ్వానం మేరకు కొంతమంది బిలినియర్లు, మిలినియర్లను, ఇన్వెస్టర్లను తీసుకొచ్చి సమ్మిట్ పెట్టి అభివృద్ధి చేస్తానంటున్నారు. ఎవరు ముఖ్యమంత్రి అన్నది ముఖ్యం కాదని.. పేద ప్రజలకు ఎలా న్యాయం జరగాలన్నదే ముఖ్యమన్నారు. రాష్ట్రం, ప్రజలు అభివృద్ధి చెందాలన్నదే తన ఉద్దేశం అన్నారు. ముఖ్యమంత్రి జగన్ తనను ఆహ్వానిస్తే.. తాను కలిసి పనిచేయడానికి సిద్ధంగా ఉన్నానని చెప్పుకొచ్చారు.

పవన్ కళ్యాణ్‌పై కూడా కేఏ పాల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. బీజేపీ-జనసేన పొత్తుపై స్పందించిన ఆయన.. పవన్ కళ్యాణ్‌కు అధికారమే ముఖ్యమని వ్యాఖ్యానించారు. ఆయన పవర్ కోసమే పార్టీ పెట్టారని.. ఈ విషయాన్ని తాను 2019 ఎన్నికలకు ముందే చెప్పినా ఎవరూ నమ్మలేదన్నారు.

పవన్ కళ్యాణ్‌ను చూస్తే విచారంగా ఉందన్నారు పాల్. 2008లో చిరంజీవి పార్టీ పెట్టినప్పుడే కాంగ్రెస్ ఏజెంట్‌ని తాను చెప్పినా ఎవరూ పట్టించుకోలేదన్నారు. తర్వాత పార్టీ పెట్టారు 18శాతం ఓటు బ్యాంక్ 18 ఎమ్మెల్యేలు వచ్చాయని.. ఓ ఎంపీ, మంత్రి పదవి కోసం చిరంజీవి పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేశారని ఘాటు వ్యాఖ్యలు చేశారు. పవన్ కళ్యాణ్‌కు కూడా సార్వత్రిక ఎన్నికల్లో 5 నుంచి 6 శాతం కూడా ఓట్లు రావు.. ఆయన ఓడిపోతారని తానే ముందే చెప్పానన్నారు. కాపులకే ఆయనకు ఓటు వేయలేదన్నారు. పవన్ ఎన్నికలకు ముందు మాయావతి కాళ్లు పట్టుకున్నారని.. మాయవతి ప్రధాని.. ఆయన ముఖ్యమంత్రి అవుదామని భావించారని.. కానీ మోదీ అధికారంలోకి ఉన్నారని నడ్డా, అమిత్ షా కాళ్లు పట్టుకున్నారని విరుచుకుపడ్డారు.

 

Leave a Reply