వెండితెరపైకి కే‌ఏ పాల్ జీవిత చరిత్ర….హీరో ఎవరంటే?

Share Icons:

 

హైదరాబాద్, 26 జూన్:

కే‌ఏ పాల్….రెండు తెలుగు రాష్ట్రాల్లో పరిచయం అక్కరలేని పేరు. మాట ప్రచారకుడు సంచలనాలు సృష్టించిన పాల్….ఇటీవల ఏపీ ఎన్నికల్లో బాగా సందడి చేశారు. తన పార్టీ ప్రజాశాంతి ఏపీ ఎన్నికల్లో క్లీన్ స్వీప్ చేస్తుందని, తానే కాబోయే సీఎం అంటూ ప్రచారం కూడా బాగా చేశారు. ఇక తన హావభావాలతో రాజకీయాల్లో కూడా మంచి వినోదాన్ని పంచారు.

అలాగే చంద్రబాబు, జగన్‌ను మట్టికరిపిస్తానని, అధికారం తనదేనని, పవన్‌ తనతో కలిస్తే స్వీప్‌ చేస్తానంటూ సాధ్యం కానీ మాటలు చెప్పి ఆశ్చర్యపరిచారు. అయితే ఆయన చెప్పింది, సాధించింది ఏమిటన్నది పక్కన పెడితే ఎన్నికల సమయంలో ఏపీ ప్రజలకు మంచి వినోదాన్ని పంచారు. ఇక ఎన్నికల ఫలితాలు ఎలా వచ్చాయో అందరికీ తెలుసు…ఈ ఫలితాల తర్వాత పాల్ అడ్రెస్ లేరు అనుకోండి.

ఇలా తన మాటలు, చేష్టలు, విశేషమైన ప్రకటనలతో నిత్యం వార్తల్లో ఉండే కె.ఎ.పాల్‌ జీవితం త్వరలో తెరకెక్కనుందని సమాచారం. కానీ జనాన్ని బాగా ఎంటర్‌టైన్ చేసిన ఆయన చేష్టలు సినిమా వాళ్లను ఆకట్టుకున్నాయి. ఈ అంశాల ప్రాతిపదికగా ఓ కొత్త దర్శకుడు పాల్‌ బయోపిక్‌ను తెరకెక్కించే ఆలోచన చేస్తున్నాడని, పాల్ పాత్రను ప్రముఖ నటుడు సునీల్‌ పోషించనున్నారన్న టాక్‌ వినిపిస్తోంది. అయితే ఇంకా అధికారికంగా దీనిపై ఎటువంటి ప్రకటన వెలువడలేదు.

 

Leave a Reply