సినీ నిర్మాత కె.రాఘవ మృతి

Share Icons:

హైదరాబాద్‌, జూలై31,  ప్రముఖ నిర్మాత, ప్రతాప్‌ ఆర్ట్స్‌ అధినేత కె. రాఘవ(105) గుండెపోటుతో మృతిచెందారు. అనారోగ్యంతో జూబ్లీహిల్స్‌ లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేరిన ఆయన ఈ తెల్లవారుజామున తుదిశ్వాస విడిచారు. తూర్పు గోదావరి జిల్లా కాకినాడ సమీపంలోని కోటిపల్లి గ్రామంలో 1913లో రాఘవ జన్మించారు. జీవితంలో అంచెలంచెలుగా ఎదిగిన రాఘవ అనేక చిత్రాలను నిర్మించారు. అందులో  సుఖదుఃఖాలు, జగత్‌ కిలాడీలు, తాత మనవడు, ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్య, చదువు సంస్కారం, అంతులేని వింతకథ, అంకితం, ఈ ప్రశ్నకు బదులేదీ వంటి చిత్రాలున్నాయి. ఆయన నిర్మించిన 27 సినిమాల్లో 25 సినిమాలు బ్లాక్ బస్టర్లు కావడం విశేషం.ఇంకా  బాలనాగమ్మ, చంద్రలేఖ వంటి చిత్రాల్లో ఆయన నటించారు. దాసరి నారాయణరావు, కోడి రామకృష్ణ వంటి పలువురు దర్శకులను చిత్రసీమకు పరిచయం చేశారు. క్రమశిక్షణకు మారుపేరైన రాఘవ, ఎటువంటి పరిస్థితులలోనైనా సరే ముందు వేసుకున్న బడ్జెట్టులోనే చిత్రాన్ని నిర్మించేవారు. ఆయనకు ఒక కుమారుడు, కుమార్తె ఉన్నారు.

మామాట: తెలుగు సినిమా భీష్మునికి అభిమానుల నివాళి

Leave a Reply