పవన్, జగన్ ఇద్దరూ జోడెద్దులు

TDP leader jupudi prabhakar fires on jagan and pawan
Share Icons:

అమరావతి, ఆగస్టు 24:

ప్రధాని నరేంద్ర మోడీకి జోడెద్దులుగా పవన్,  జగన్ మారారని, రాజకీయ పరణితి లేకే జగన్ పెళ్లిళ్లు గురించి మాట్లాడుతున్నారని టీడీపీ ఎమ్మెల్సీ జూపూడి ప్రభాకర్ రావు విమర్శించారు. ఈరోజు ఆయన అమరావతిలో మీడియాతో మాట్లాడుతూ…1982 తర్వాత దేశంలో ఎన్నో పొత్తులు కుదిరాయని, దేశంలో కాంగ్రెస్ పార్టీ ఏకపార్టీ పాలన ముగిశాక ప్రాంతీయ పార్టీల మధ్య పొత్తులు ఎన్నో వచ్చాయని గుర్తు చేశారు.

ఇక కాంగ్రెస్ గతంలో టిఆర్ఎస్., సిపిఎం., సిపిఐలతో జత కట్టలేదా అని, ఇప్పుడు టిఆర్ఎస్-బీజేపీల గురించి జగన్  ఎందుకు మాట్లాడారని ఆయన ప్రశ్నించారు. ఇక అడగకుండానే రాష్ట్రపతి, ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో జగన్ ఎందుకు మద్ధతు ఇచ్చారని నిలదీశారు.

దేశంలో టీడీపీ కీలక పాత్ర పోషించబోతోందని, మోదీ హవా వచ్చే ఎన్నికల్లో ఉండదని అన్నారు. దేశంలోని అన్ని రాష్ట్రాలలో పీడీ అకౌంట్లను నిర్వహిస్తున్నారని, బీజేపీ పాలిత రాష్ట్రాలలో కూడా పీడీ అకౌంట్లు ఉన్నాయని ఆయన తెలిపారు. రాజస్థాన్, మహారాష్ట్రలలో కూడా పీడీ అకౌంట్లు ఉన్నాయని, అక్కడి ఖాతాలపై కూడా సీబీఐ విచారణ వేయాలని జీవిఎల్  కోరగలరా అని అన్నారు.

మామాట: మొన్నటివరకు మీరు కూడా బీజేపీకి ఒంటెద్దుగా ఉన్నారుగా…

Leave a Reply