అయ్యో.. న్యాయమూర్తి కూడానా?

Share Icons:

తిరుపతి, ఆగష్టు 14,

ఇప్పటికే  మన దేశానికి విదేశాల్లో చాలా చెడ్డపేరు వచ్చేసింది. భారత్ మహిళలకు ఎంత మాత్రం క్షేమం కాదని పలు నివేదికలు ఘోషిస్తున్నాయి.  మహిళలపై జరిగే నేరాలకు సకాలంలో శిక్షలు పడకపోవడమే నేరాలు అదుపుకాకపోవడానికి కారణంగా కొందరు న్యాయస్థానాల తీరును ప్రశ్నిస్తున్నారు.  ఈ నేపథ్యంలో ఏకంగా ఓ న్యాయమూర్తే లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కోవడం విచారకరం…. వివరాలు ఇలా ఉన్నాయి…

నల్గొండ జిల్లా తుంగతుర్తి సెషన్స్ కోర్టు న్యాయమూర్తి సత్యనారాయణను పోలీసులు అరెస్ట్ చేశారు. ఆయనపై ఇటీవల లైంగిక వేధింపుల ఆరోపణలు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కేసు నమోదు చేసి విచారణ జరిపిన హైదరాబాద్, చిక్కడపల్లి పోలీసులు, ఆరోపణలపై ప్రాథమిక సాక్ష్యాధారాలు ఉన్నాయని తేల్చారు. ఈ విషయాన్ని హైకోర్టుకు తెలిపి, సత్యనారాయణ అరెస్ట్ కు అనుమతి తీసుకున్నారు. ఈ ఉదయం జడ్జి సత్యనారాయణను అరెస్ట్ చేసినట్టు పోలీసు వర్గాలు ధ్రువీకరించాయి. దీనిపై స్పంధించడానికి న్యాయమూర్తి అందుబాటులో లేరు.

మామాట: అందుకే అన్నారు ఏ పుట్టలో ఏ పాముందో అని

Leave a Reply