అవునా… జూనియర్ లేడా?

jr NTR, ntr biopic-krish-balakrishna-tdp
Share Icons:

 హైదరాబాద్, అక్టోబర్27,

దివంగత నటరత్న ఎన్. టీ. ఆర్. జీవితం ఆధారంగా నిర్మిస్తున్న బయోపిక్ గురించిన పలు పుకార్లు షికార్లు చేస్తున్నాయి. అయితే  తాజాగా ఈ బయోపిక్ లో జూనియర్ ఎన్టీయార్ లేడనే వార్త విపరీతంగా వైరలవుతోంది. ఇటీవల జూనియర్ సినిమా అరవింద సమేతా సక్సెస్ మీట్ లో బాలకృష్ణ పాల్గొన్న తరువాతే ఈ రూమర్ పాపులర్ కావడం విశేషం. నిజానికి సినిమాలో బాలకృష్ణ పాత్రకు జూనియర్ ని ఎంపిక చేసినట్టు వార్తలు వచ్చినా అవన్నీ తూచ్….. జీనియర్ కేవలం తన వాయిస్ మాత్రమే ఇస్తాడు అంతే అంటున్నాయి.. తాజా వార్తలు… కానీ, చిత్ర దర్శకుడు క్రిష్ తన సన్నిహితుల వద్ద ఇదే విషయాన్ని ఇప్పటికే ప్రస్తావించాడట కూడా,  జూనియర్ కి పాత్రే కాదు అసలు వాయిస్ కూడా బయోపిక్ లో వాడుకోవడం లేదన్నది క్రిష్ అభిప్రాయంగా తెలుస్తోంది.  ఈ చిత్రాన్ని నందమూరి బాలకృష్ణ, సాయ్ కూరపాటి, విష్ణుఇందూరి సంయుక్తంగా నిర్మిస్తున్న విషయం తెలిసిందే.

మామాట:  మహానటి సినిమాలో మాత్రం అన్నీ ఉన్నాయా ఏమిటీ..

Leave a Reply