కాలేజీలోకి ఎంటర్ అయిన ‘ఎన్టీఆర్’….

Jr NTR Movie Aravinda Sametha Shooting
Share Icons:

హైదరాబాద్, 17 జూలై:

యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో ‘అరవింద సమేత వీర రాఘవ’ అనే సినిమా రూపొందుతోన్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ సినిమా కొంతవరకూ చిత్రీకరణను జరుపుకుంది.

అయితే తాజాగా ఈ సినిమా షూటింగ్ ఒక కాలేజ్ లో జరుగుతోంది. దీంతో హీరో ఎన్టీఆర్, హీరోయిన పూజా హెగ్డే కాలేజీలోకి ఎంటర్ అయ్యారు. ఇక వీరి కాంబినేషన్లో వచ్చే సన్నివేశాలను నిన్నటి నుంచి చిత్రీకరిస్తున్నారు. లవ్, కామెడీ కలగలిసిన ఈ సన్నివేశాలు పూర్తి ఎంటర్టైనింగ్‌గా సాగుతాయట.

కాలేజీ నేపథ్యంలో జరిగే ఈ షెడ్యూల్‌ ఆగష్టు 3వ తేదీ వరకు జరగనుంది. ఆ తరువాత చిన్న విరామం తీసుకుని ఈ సినిమా టీమ్ కేరళలోని ‘పొల్లాచ్చి’ వెళ్లనుంది. అక్కడ కొన్ని యాక్షన్ సీన్స్ తో పాటు ఒక పాటను కూడా చిత్రీకరించనున్నట్టుగా తెలుస్తోంది.

రాయలసీమ నేపథ్యంలో సాగే ఈ చిత్రంలో జగపతిబాబు, నాగబాబు ఇద్దరు రెండు ఫ్యాక్షన్ గ్రూపులకు చెందిన నాయకుల పాత్రల్లో నటిస్తున్నారు. ఇక ఎన్టీఆర్ కూడా అటు కాలేజీకి సంబంధించిన పాత్రలోనూ, ఇటు ఫ్యాక్షన్ పాత్రలోను కనిపించనున్నాడు.

తమన్ సంగీతం అందిస్తున్న ఈ చిత్ర టీజర్‌ని స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఆగస్టు 15వ తేదీన విడుదల చేయనున్నారు. అలాగే ఈ సినిమాని అక్టోబర్ 10వ తేదీన విడుదల చేయడానికి చిత్రబృందం సన్నాహాలు చేస్తోంది.

మామాట: మరి చిత్రం ఏ స్థాయిలో ప్రేక్షకులని అలరిస్తుందో చూడాలి..?

Leave a Reply