మళ్ళీ ఆ ముగ్గురు హీరోలు కలిశారు…

Jr NTR, mahesh babu and ram charan met in vamshi paidipally birthday function
Share Icons:

హైదరాబాద్, 28 జూలై:

ఒకప్పుడు మన తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఏ ఇద్దరు స్టార్ హీరోలు ఒకే వేదిక పంచుకోవడం కనిపించేది కాదు. ఎందుకంటే ఇద్దరు హీరోలకి సంబంధించిన అభిమానులు ఒక చోటకి చేరితే గొడవలు అవుతాయనో లేక హీరోలు ఇగో సమస్య ఉండటం వలన అలాంటి సందర్భాలు వచ్చేవి కాదు.

కానీ ఇప్పుడు అలా కాదు ఒక హీరో సినిమా ఈవెంట్‌కి మరో హీరో వెళ్ళడం, అలాగే ఒకరి ఫ్యామిలీతో మరొకరి ఫ్యామిలీ సన్నిహితంగా ఉండటం ఎక్కువగానే జరుగుతున్నాయి. ఇక అభిమానులు కూడా ఇలాంటి అరుదైన దృశ్యాలని చూసి బాగా ఆనందపడుతున్నారు కూడా.

అయితే ముఖ్యంగా మన తెలుగు స్టార్ హీరోలు మహేష్ బాబు, ఎన్టీఆర్, రామ్ చరణ్‌లు మధ్య స్నేహం గురించి ప్రత్యేకంగా మాట్లాడుకునే విధంగా ఈ మధ్య వారి ఫొటోలు సోషల్ మీడియాలో సంచరిస్తున్నాయి. వీరి అన్యోన్యతను చూసి తెలుగు సినిమా ఇండస్ట్రీ అంటే ఇది అనేలా అభిమానులని గర్వ పడేలా చేస్తున్నారు. ఇటీవల ఏ వీరికి సంబంధించిన ఏ ఈవెంట్ అయినా ఫ్యామిలీ ఫంక్షన్ అయినా వీరు కలవడం చూస్తూనే ఉన్నాం.

ఈ నేపథ్యంలోనే తాజాగా జూలై 27 దర్శకుడు వంశీ పైడిపల్లి తన పుట్టినరోజుని పురస్కరించుకుని ఓ గ్రాండ్ పార్టీని ఇచ్చారు. ఈ పార్టీకి మహేష్ బాబు, ఎన్టీఆర్, రామ్ చరణ్ హాజరై అందరినీ మరోసారి ఆశ్చర్యపరిచారు. వంశీపైడిపల్లితో వారు దిగిన ఫొటో ఇప్పుడు సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది. ఇక వంశీ పైడిపల్లితో ఎన్టీఆర్ ‘బృందావనం’ సినిమా చేస్తే, రామ్ చరణ్ ‘ఎవడు’ చిత్రం చేశారు. మహేష్ తన 25వ చిత్రాన్ని ప్రస్తుతం వంశీ పైడిపల్లి దర్శకత్వంలోనే చేస్తున్నారు.

మామాట: ఇంకా మిగతా హీరోలు కూడా కలిస్తే బాగుంటుంది…

Leave a Reply