‘ఎన్టీఆర్‌’లో ఎన్టీఆర్ ఉంటాడు కానీ……!

jr NTR in NTR biopic
Share Icons:

హైదరాబాద్, 23 అక్టోబర్:

దివంగత నేత, ఉమ్మడి ఏపీ మాజీ సీఎం ‘ఎన్టీఆర్’ జీవిత చరిత్ర ఆధారంగా బయోపిక్ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. నందమూరి బాలకృష్ణ నటిస్తూ, నిర్మిస్తున్న ఈ చిత్రానికి క్రిష్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఇక ఇప్పటిదాకా వదిలిన ఫొటోలు, పోస్టర్స్‌తో ఎన్టీఆర్ బయోపిక్ ఇప్పటికే విపరీతమైన క్రేజ్‌ని సొంతం చేసుకుంది. అలాగే పలువురు స్టార్ నటులు ఈ చిత్రంలో నటిస్తుండటంతో జాతీయ స్దాయిలో కూడా ఈ సినిమా గురించి మాట్లాడుకునే స్దాయికి వచ్చింది. 

ఈ నేపథ్యంలోనే ఎన్టీఆర్ బయోపిక్‌లో జూనియర్ ఎన్టీఆర్ నటిస్తున్నాడంటూ వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. అయితే కొందరు ఈ వార్తలని కొట్టి పారేస్తుండగా…మరికొందరైతే ఎన్టీఆర్ ఉండే అవకాశామని చెబుతున్నారు.

అలాగే చిత్రబృందం కూడా ఎన్టీఆర్ ఉంటే  ప్రాజెక్టుపై అనవసరమైన అంచనాలు ఏర్పడతాయి అని భావిస్తోందిట. కాకపోతే ఎన్టీఆర్‌ని ఎంతవరకూ ఉపయోగించుకోవాలో అంతవరకే ఈ బయోపిక్‌కు ఉపయోగించుకోవాలని ఫిక్స్ అయ్యారట. 

ఆ ప్రకారం ఎన్టీఆర్‌తో ఈ సినిమాకు ప్రారంభంలో వాయిస్ ఓవర్ చెప్పిస్తే ఎలా ఉంటుంది అని టీమ్ ఆలోచన చేస్తోందిట. అలాగయితే ఎన్టీఆర్ ఉన్నట్లు ఉంటుంది..కానీ తెరపై కనపడరు. ఎందుకంటే ఎన్టీఆర్ లాంటి నటుడు తెరపైకి రావాలంటే అందుకు తగ్గ ప్రతిష్టాత్మకమైన పాత్ర ఉండాలి. ఇప్పటికే దాదాపు షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రంలో ఇంకా అలాంటి పాత్రలు ఏముండే అవకాశం ఉంటుంది. అందుకే వాయిస్ ఓవర్‌తో ఎన్టీఆర్‌ని సీన్‌లోకి తీసుకురావాలని సిద్ధం అయ్యారట. 

మామాట: అఫీషియల్‌గా ప్రకటన వచ్చే వరకు ఏమి చెప్పలేములే….

Leave a Reply