కల్యాణ్‌రామ్ తల్లి గురించి తారక్ ఏం చెప్పాడో తెలుసా…

kalyan ram gave a costly birthday gift to his brother NTR
Share Icons:

హైదరాబాద్, 9 అక్టోబర్:

ఇటీవల కాలంలో మనం చూస్తున్న ఆదర్శ అన్నదమ్ములెవరంటే వీరిద్దరి పేర్లే చెప్పొచ్చు. వారే ఎన్టీఆర్- కల్యాణ్‌రామ్‌. వీరిని చూసిన ప్రతి ఒక్కరూ అన్నదమ్ములంటే ఇలా ఉండాలి అనుకోకుండా ఉండరేమో..

ఒకప్పుడు ఈ అన్నదమ్ములిద్దరి మధ్య అసలు మాటలే ఉండేవి కాదు. ఎదురైనా తల దించుకుని వెళ్లిపోవడం తప్ప ఒకరినొకరు పలకరించుకునేవారు కాదు. కానీ, ఇప్పుడు అంతా మారిపోయింది.

ఎన్ని కష్టాలొచ్చినా అన్న చెయ్యి తమ్ముడు వదలడు. తమ్ముడిని అన్న ఎప్పుడూ ఒంటరిని చెయ్యడు. ఇద్దరి తండ్రి ఒకడే అయినా తల్లులు వేరు కదా.. అసలు వీరివురూ ఒకరి తల్లితో మరొకరు ఎలా మాట్లాడతారు? ఏమని పిలుస్తారు? అనే సందేహం చాలా మందికి ఉండేది.

అయితే తాజాగా తారక్ కల్యాణ్ రామ్ తల్లి గురించి తారక్ చెప్పిన మాటలతో అందరికీ వారి అన్యోన్యత మరింత తెలిసింది. తన తండ్రి హఠాన్మరణం చెందడంతో తాను, కల్యాణ్ రామ్ ఎంతో బాధ పడుతున్నామని, ఆ సంఘటన నుండి బయటకి రాలేకపోతున్నామని ఉద్వేగభరితంగా చెప్పాడు.

తమ కంటే తమ తల్లుల బాధ ఇంకా పెద్దదని చెప్పిన తారక్, కల్యాణ్ రామ్ తల్లిని పెద్దమ్మ అని సంభోదిస్తూ.. తన తల్లితో పాటు పెద్దమ్మ తీవ్ర మనోవేదనకి గురవుతున్నట్లు భావోద్వేగానికి లోనయ్యాడు.

ఈ విషయంలో తారక్ మాత్రమే కాదు.. కల్యాణ్ రామ్ సైతం తారక్ తల్లిని ఎంతో ప్రేమగా చూసుకుంటాడు. ఇద్దరూ వారివురినీ ఒకే విధంగా భావిస్తారు. అందుకే అభిమానులు వారిని కలియుగ రామలక్ష్మణులుగా అభివర్ణిస్తారు.

తండ్రి చనిపోయి అంతా బాధలో ఉండి కూడా వెంటనే కల్యాణ్‌రామ్, ఎన్టీఆర్ ఇద్దరూ షూటింగులకు వెళ్ళి వృత్తి పట్ల వారికున్న అంకిత భావాన్ని తెలియజెప్పారు. అన్నదమ్ములిద్దరిదీ ఒకే మాట మాత్రమే కాదు ఒకే బాట అని అర్ధమవుతుంది.

మామాట: ఏదేమైనా ఈ అన్నదమ్ములిద్దరి అంకితభావం గొప్పది…

Leave a Reply