జేపీ నడ్డా వర్సెస్ కేటీఆర్…మధ్యలో ఉప్పల్ బాలు

jp nadda vs ktr and uppal balu
Share Icons:

హైదరాబాద్:

 

గత కొన్ని రోజులుగా తెలంగాణలో బీజేపీ-టీఆర్ఎస్ నేతల మధ్య మాటల యుద్ధం నడుస్తున్న విషయం తెలిసిందే. ఇటీవల తెలంగాణకి వచ్చిన బీజేపీ జాతీయ  వర్కింగ్ ప్రెసిడెంట్ జేపీ నడ్డా టీఆర్ఎస్ పై తీవ్ర విమర్శలు చేశారు. కేసీఆర్ కాళేశ్వరం ప్రాజెక్టులో వేల కోట్ల అవినీతికి పాల్పడిందని ఆరోపించారు. దీనికి ప్రతిగా జేపీ నడ్డా ఎవరో తనకు తెలియదంటూ కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతోన్నాయి. నడ్డా నాటకాలు ఇక్కడ పనిచేయవని, అసలు నడ్డా ఎవరో తనకు తెలియదని అన్నారు.

 

దీంతో టీఆర్ఎస్-బీజేపీ నేతల మధ్య విమర్శలు, ప్రతి విమర్శలు మొదలయ్యాయి. గతంలో నడ్డాను కలిసిన కేటీఆర్ వీడియోలు, ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ నడ్డా ఎవరో తెలియదన్న కేటీఆర్ వీటిని చూసి సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. దీంతో బీజేపీ నేతలకు కౌంటర్‌గా టీఆర్ఎస్ అభిమానులు ఉప్పల్ బాలును రంగంలోకి దింపారు.

 

నడ్డా-ఉప్పల్ బాలు ఫొటోలను షేర్ చేస్తూ వీరిలో మీకు ఎవరు బాగా తెలుసో చెప్పాలంటూ నెటిజన్లను ప్రశ్నిస్తున్నారు. ఇది చూసిన బీజేపీ అభిమానులు కేటీఆర్-ఉప్పల్ బాలు ఫొటోలను పెట్టి వీరిలో మీకు బాగా తెలిసిన వ్యక్తి ఎవరో చెప్పాలంటూ సోషల్ మీడియాలో యుద్ధానికి తెరలేపారు. టీఆర్ఎస్-బీజేపీ యుద్ధం సంగతేమో కానీ.. మధ్యలో ఉప్పల్ బాలుకు మాత్రం విపరీతమైన ప్రచారం లభిస్తోంది.

 

Leave a Reply