కరోనా సహాయం అందని భాదిత జర్నలిస్ట్ కుటుంబాల మీడియా అకాడమీ ముట్టడి!

Share Icons:
  • చనిపోయిన ప్రతి జర్నలిస్ట్ కుటుంబానికి 10 లక్షలు సహాయం అందించాలి
  • కరోనా  భాదిత జర్నలిస్టులను ఆదుకోవడంలో ప్రభుత్వం వైఫల్యం
  • జర్నలిస్ట్ హెల్త్ ఇన్సూరెన్స్ పై ప్రభుత్వ వైఖరి గర్హనీయం
  • చెల్లు బాటు కానీ జరలిస్ట్ హెల్త్ కార్డు

కరోనా చనిపోయిన జర్నలిస్టులకు ఆర్థిక సహాయం అందించడంలో ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని నిరసిస్తూ మీడియా అకాడమిని ముట్టడించాలని హైద్రాబాద్ లో జరిగిన టీయుడబ్ల్యుజె (ఐజేయూ ) రాష్ట్ర కార్యవర్గ సమావేశం పిలుపు నిచ్చింది. జర్నలిస్టుల సమస్యల పరిష్కారంలో ప్రభుత్వ మాటలు తప్ప ఆచరణలో అమలు నోచుకోవడం లేదని సమావేశం మండిపడింది. వివిధ వర్గాల సంక్షేమం కోసం పాటుపడుతున్నట్లు గొప్పలు చెబుకుంటున్న పాలకులు జర్నలిస్టుల సంక్షేమాన్ని ఎందుకు విస్మరిస్తున్నారని ఇండియన్ జర్నలిస్ట్స్ యూనియన్(ఐజేయూ), తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్టుల సంఘం (టీయుడబ్ల్యుజె) నాయకత్వం ప్రశ్నించింది.

ఆదివారం నాడు హైదర్ గుడ లోని సెంటర్ పార్క్ హోటల్ కాన్ఫరెన్స్ హాలులో టీయుడబ్ల్యుజె రాష్ట్ర అధ్యక్షులు నగునూరి శేఖర్ అధ్యక్షతన జరిగిన రాష్ట్ర విస్తృత కార్యవర్గ సమావేశంలో జర్నలిస్టులు ఎదుర్కొంటున్న వివిధ సమస్యలపై దాదాపు 6 గంటల పాటు సమావేశం చర్చించింది. చనిపోయిన ప్రతి జర్నలిస్ట్ కుటుంబాన్ని 10 లక్షల ఆర్థిక సహాయం అందించి ఆదుకోవాలని సమావేశం డిమాండ్ చేసింది. టార్గెట్ ల పేరుతొ యాజమాన్యాలు జర్నలిస్టులను వేదించడంపై సమావేశం ఆందోళన వ్యక్తం చేసింది.. జర్నలిస్టులకు హెల్త్ కార్డు లు ఉన్నా అవి చెల్లు బాటు కాకపోవడం అనేక మంది జర్నలిస్టుల ఇబ్బందులపై సమావేశం ఆందోళన వ్యక్తం చేసింది.

జర్నలిస్ట్ ల కుటంబాలు ఇబ్బందుల్లో ఉన్నా వారికీ ప్రభుత్వం అందిస్తామన్న ఆర్థిక సహాయం సకాలంలో అందకపోవడం కుటుంబాలు పడుతున్న ఇబ్బందులను వివిధ జిల్లాల నుంచి వచ్చిన నాయకులు సమావేశంలో వివరించారు. ఇల్లు ,ఇళ్ల స్థలాల విషయం స్వయంగా రాష్ట్ర ముఖ్యమంత్రి చేసిన వాగ్దానం నెరవేరక పోవడం గర్హనీయమని సమావేశం అభిప్రాయం పడింది. జర్నలిస్ట్ సమస్యలపై ముఖ్యమంత్రి కేసీఆర్ కు లేఖ రాయాలని సమావేశం నిర్ణయించింది.

-కె. రాంనారాయణ, సీనియర్ జర్నలిస్ట్.

 

Leave a Reply