ఈసీఐఎల్‌లో ఉద్యోగాలు..హైదరాబాద్:650

junior technical officer jobs in hyderabad ecil
Share Icons:

హైదరాబాద్, 27 డిసెంబర్:

హైద‌రాబాద్‌లోని భార‌త ప్ర‌భుత్వ రంగ సంస్థ‌ ఎల‌క్ట్రానిక్స్ కార్పొరేష‌న్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (ఈసీఐఎల్) ఒప్పంద ప్రాతిప‌దిక‌న జూనియ‌ర్ టెక్నిక‌ల్ ఆఫీస‌ర్, జూనియ‌ర్ క‌న్స‌ల్టెంట్ పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.

ఉద్యోగ వివ‌రాలు…

మొత్తం ఖాళీలు: 2100

జోన్లు/ హెడ్ క్వార్ట‌ర్ వారీగా ఖాళీలు:

1) హైద‌రాబాద్: 650

2) న్యూదిల్లీ: 550

3) బెంగ‌ళూరు: 225

4) ముంబ‌యి: 25

5) కోల్‌క‌తా: 650

జూనియ‌ర్ టెక్నిక‌ల్ ఆఫీస‌ర్: 1470

అర్హ‌త‌: ఎల‌క్ట్రానిక్స్ అండ్ క‌మ్యూనికేష‌న్ ఇంజినీరింగ్‌/ ఎల‌క్ట్రిక‌ల్/ ఎల‌క్ట్రానిక్స్ ఇంజినీరింగ్/ ఎల‌క్ట్రానిక్స్ అండ్ ఇన్‌స్ట్రుమెంటేష‌న్ ఇంజినీరింగ్‌/ మెకానిక‌ల్ ఇంజినీరింగ్‌/ కంప్యూట‌ర్ సైన్స్ ఇంజినీరింగ్‌/ ఇన్ఫ‌ర్మేష‌న్ టెక్నాల‌జీలో ఇంజినీరింగ్ డిగ్రీ ఉత్తీర్ణ‌త‌.

జూనియ‌ర్ క‌న్స‌ల్టెంట్-ఫీల్డ్ ఆప‌రేష‌న్ (గ్రేడ్‌-1): 315

అర్హ‌త‌: ఎల‌క్ట్రానిక్స్ అండ్ క‌మ్యూనికేష‌న్ ఇంజినీరింగ్‌/ ఎల‌క్ట్రిక‌ల్/ ఎల‌క్ట్రానిక్స్ ఇంజినీరింగ్/ ఎల‌క్ట్రానిక్స్ అండ్ ఇన్‌స్ట్రుమెంటేష‌న్ ఇంజినీరింగ్‌/ మెకానిక‌ల్ ఇంజినీరింగ్‌/ కంప్యూట‌ర్ సైన్స్ ఇంజినీరింగ్‌లో ఇంజినీరింగ్ డిప్లొమా ఉత్తీర్ణ‌త‌.

జూనియ‌ర్ క‌న్స‌ల్టెంట్-ఫీల్డ్ ఆప‌రేష‌న్ (గ్రేడ్‌-2): 315

అర్హ‌త‌: ఎల‌క్ట్రానిక్ మెకానిక్‌/ ఆర్ అండ్ టీవీ/ ఎల‌క్ట్రిక‌ల్ అండ్ ఫిట్ట‌ర్ ట్రేడుల్లో రెండేళ్ల‌ ఐటీఐ ఉత్తీర్ణ‌త‌.

ఎంపిక‌: విద్యార్హ‌త‌లో ప్ర‌తిభ‌, ధ్రువ‌ప‌త్రాల ప‌రిశీల‌న ఆధారంగా.

ద‌ర‌ఖాస్తు విధానం: ఆన్‌లైన్.

చివ‌రితేది: 05.01.2019.

పూర్తి వివరాలకు

వెబ్‌సైట్: http://careers.ecil.co.in/advt5018.php

Leave a Reply