బాస‌ర‌ ఆర్‌జీకేయూకేటీలో ఉద్యోగాలు…

Share Icons:

బాసర, 10 జనవరి:

బాస‌ర‌లోని రాజీవ్ గాంధీ యూనివ‌ర్సిటీ ఆఫ్ నాలెడ్జ్ టెక్నాల‌జీస్ (ఆర్‌జీకేయూకేటీ) తాత్కాలిక ప్రాతిప‌దిక‌న కింది టీచింగ్‌, నాన్‌-టీచింగ్ పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.

ఉద్యోగ వివ‌రాలు…

పోస్టు: టీచింగ్‌

గెస్ట్ ఫ్యాక‌ల్టీ

విభాగాలు: ఎల‌క్ట్రిక‌ల్ అండ్ ఎల‌క్ట్రానిక్స్ ఇంజినీరింగ్, కెమిస్ట్రీ, మ్యాథ‌మేటిక్స్, ఫిజిక్స్, ఇంగ్లిష్.

అర్హ‌త‌:ఇంజినీరింగ్ విభాగాల‌కు బీఈ/ బీటెక్, ఎంఈ/ ఎంటెక్‌; నాన్‌-ఇంజినీరింగ్ విభాగాల‌కు మాస్ట‌ర్స్ డిగ్రీ, నెట్‌/ స్లెట్‌/ సెట్ లేదా పీహెచ్‌డీ ఉత్తీర్ణ‌త‌.

* నాన్‌-టీచింగ్‌

గెస్ట్ ల్యాబోరేట‌రీ అసిస్టెంట్

విభాగాలు: ఈఈఈ, ఇంగ్లిష్.

అర్హ‌త‌: ఇంజినీరింగ్ విభాగానికి బీఈ/ బీటెక్ లేదా డిప్లొమా; నాన్‌-ఇంజినీరింగ్ విభాగానికి గ్రాడ్యుయేష‌న్‌తోపాటు కంప్యూట‌ర్స్, ఇంగ్లిష్ ప‌రిజ్ఞానం ఉండాలి.

ఎంపిక‌: రాత ప‌రీక్ష‌, ట్రేడ్ టెస్ట్, ఇంట‌ర్వ్యూ ఆధారంగా.

ద‌ర‌ఖాస్తు విధానం: ఆన్‌లైన్.

చివ‌రితేది: 20.01.2019.

Leave a Reply