బెంగళూరు ఐటీఐ లిమిటెడ్‌లో ఉద్యోగాలు

jobs in bangalore iti limited
Share Icons:

బెంగళూరు, 14 సెప్టెంబర్:

కర్ణాటక రాష్ట్రం బెంగ‌ళూరులోని భార‌త ప్ర‌భుత్వ రంగ సంస్థ ఐటీఐ లిమిటెడ్ అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ (ఏఈఈ) ట్రైనీల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తుల కోరుతోంది.

ఉద్యోగ వివ‌రాలు…

పోస్టు: అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ ట్రైనీలు

శిక్ష‌ణ కాలం: రెండేళ్లు.

స్టైపెండ్: మొద‌టి ఏడాది నెల‌కు రూ.15,000, రెండో ఏడాది నెల‌కు రూ.16,000 చెల్లించ‌నున్నారు.

మొత్తం ఖాళీలు: 60

అర్హ‌త‌: సివిల్, ఎల‌క్ట్రానిక్స్, ఎల‌క్ట్రిక‌ల్, ఎల‌క్ట్రానిక్స్ అండ్ క‌మ్యూనికేష‌న్, ఎల‌క్ట్రానిక్స్ అండ్ ఎల‌క్ట్రిక‌ల్స్, టెలీ క‌మ్యూనికేష‌న్, ఇండ‌స్ట్రియ‌ల్ అండ్ ప్రొడ‌క్ష‌న్, ఇన్ఫ‌ర్మేష‌న్ టెక్నాల‌జీ, కెమిక‌ల్, కంప్యూట‌ర్ సైన్స్, మెకానిక‌ల్ ఇంజినీరింగ్‌లో గ్రాడ్యుయేష‌న్ ఉత్తీర్ణ‌త‌.

వయసు: 28 ఏళ్లు మించ‌కూడుదు.

ద‌ర‌ఖాస్తు విధానం: ఆన్‌లైన్/ ఆఫ్‌లైన్. ముందుగా ఆన్‌లైన్‌లో ద‌ర‌ఖాస్తు చేసుకోవాలి. ఆ ద‌ర‌ఖాస్తు హార్డ్‌కాపీకి ఇత‌ర ధ్రువీక‌ర‌ణ ప‌త్రాలు జ‌త చేసి పోస్టులో పంపాలి.

ద‌ర‌ఖాస్తు ఫీజు: రూ.300.

ఆన్‌లైన్ ద‌ర‌ఖాస్తుకు చివ‌రితేది: 25.09.2018.

ద‌ర‌ఖాస్తు హార్డ్ కాపీల‌ను పంప‌డానికి చివ‌రితేది: 27.09.2018.

చిరునామా: DY. GENERAL MANAGER, ITI LIMITED, REGD & CORPORATE OFFICE, ITI BHAVAN, DOORAVANI NAGAR, BENGALURU – 560016.

పూర్తి వివరాలకోసం

వెబ్‌సైట్: http://www.itiltd-india.com/careers

Leave a Reply