HCUలో ఉద్యోగాలు..

Share Icons:

హైదరాబాద్, ఏప్రిల్ 15,

నాన్ టీచింగ్ పోస్టుల భర్తీకోసం హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయం దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. ఇందుకు సంబంధించిన పూర్తి సమాచారం, అర్హత, వివరాలన్నీ తమ వెబ్‌సైట్‌లో పొందుపరిచింది. ఆసక్తి కలిగిన అభ్యర్థులు చివరితేదీలోగా ఆన్‌లైన్ అప్లై చేసుకోవాలంటూ సూచిస్తోంది. ఇందులో జూనియర్ ఇంజినీర్, సీనియర్ అసిస్టెంట్, స్టెనో గ్రాఫర్, ల్యాబ్ అసిస్టెంట్, జూనియర్ ప్రొఫెషనరల్ అసిస్టెంట్, లైబ్రరీ/హాస్పిటల్ అటెండర్ పోస్టులున్నాయి.
ఉద్యోగ పూర్తి వివరాలు..
పోస్టులు : జూనియర్ ఇంజినీర్ (సివిల్/ఎలక్ట్రికల్) -5
సీనియర్ అసిస్టెంట్ -1
స్టెనోగ్రాఫర్ -1
ల్యాబ్ అసిస్టెంట్ -1
జూనియర్ ప్రొఫెషనల్ అసిస్టెంట్ -1
లైబ్రరీ/హాస్పిటల్ అటెండెంట్ -2
అర్హతలు : పోస్టులను బట్టి పదో తరగతి, ఇంటర్, డిప్లొమా, బ్యాచిలర్ డిగ్రీ, పీజీ, స్టెనో, కంప్యూటర్ నాలెడ్జ్‌తో పాటు ఎక్స్‌పీరియన్స్ ఉండాలి
ఎంపిక : రాత, టాలెంట్ టెస్ట్ ద్వారా ఉంటాయి.
వయసు : పోస్టులను బట్టి ఉంటుంది.
జీతం : జూనియర్ ఇంజినీర్ (సివిల్) గ్రూప్ బి -రూ.35,400-1,12,400 వరకు(నెలకు)
జూనియర్ ఇంజినీర్ (ఎలక్ట్రికల్) గ్రూప్ బి -రూ.35,400-1,12,400 వరకు(నెలకు)
సీనియర్ అసిస్టెంట్ గ్రూప్ బి -రూ.35,400-1,12,400 వరకు(నెలకు)
స్టెనో గ్రాఫర్ గ్రూప్ సి -రూ.25,500-రూ.81,100(నెలకు)
ల్యాబోరేటరీ అటెండెంట్ -రూ.18,000-56,900(నెలకు)
జూనియర్ ప్రొఫెషనల్ అసిస్టెంట్ గ్రూప్ సి -రూ.29,200-92,300(నెలకు)
లైబ్రరీ అటెండెంట్ గ్రూప్ సి -రూ.18,000-56,900(నెలకు)
హాస్పిటల్ అటెండెంట్ గ్రూప్ సి -రూ.రూ.18,000-56,900(నెలకు)
ముఖ్యమైన తేదీలు :
నోటిఫికేషన్ విడుదల తేదీ : 18-03-2019
ఆన్‌లైన్ అప్లికేషన్ ప్రారంభ తేదీ : 20-3-2019
ఆన్‌లైన్‌లో ఫీజు చెల్లించేందుకు చివరితేదీ : 22-04-2019
ఆన్‌లైన్ దరఖాస్తు చివరితేది : 25-04-2019
హార్డుకాపీలు పంపడానికి చివరితేది : 30-04-2019
వెబ్‌సైట్ : www.uohyd.ac.in

Leave a Reply