తెలుగు రాష్ట్రాల్లో రైల్వే ఉద్యోగాలు…4103 పోస్టులు

multiple vacancies in bel, HPCL, agriculture scientists
Share Icons:

హైదరాబాద్: సికింద్రాబాద్ కేంద్రంగా ఉన్న దక్షిణ మధ్య రైల్వే భారీగా ఉద్యోగాల భర్తీ చేపట్టింది. మొత్తం 4103 ఖాళీలను ప్రకటించింది. ఏసీ మెకానిక్, కార్పెంటర్, ఎలక్ట్రీషియన్, ఫిట్టర్ లాంటి పోస్టుల్ని భర్తీ చేయనుంది. ఈ అప్రెంటీస్ పోస్టుల్ని దక్షిణ మధ్య రైల్వే పరిధిలోని 27 యూనిట్లలో భర్తీ చేయనుంది. ఇందులో 25 యూనిట్లు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో ఉన్నాయి. మొత్తం 4103 ఉద్యోగాల్లో ఎక్కువగా తెలుగు రాష్ట్రాల్లోనే ఉండటం విశేషం. నోటిఫికేషన్‌ను దక్షిణ మధ్య రైల్వే అధికారిక వెబ్‌సైట్ scr.indianrailways.gov.in ఓపెన్ చేసి చూడొచ్చు. దరఖాస్తుకు 2019 డిసెంబర్ 8 చివరి తేదీ.

ఖాళీల వివరాలివే…

మొత్తం ఖాళీలు- 4103

ఫిట్టర్- 1460

ఎలక్ట్రీషియన్- 871

డీజిల్ మెకానిక్- 640

వెల్డర్-597ఏసీ మెకానిక్- 249

ఎలక్ట్రానిక్ మెకానిక్- 102

మెకానిస్ట్- 74

పెయింటర్- 40

ఎంఎండబ్ల్యూ- 34

ఎలక్ట్రికల్ / ఎలక్ట్రానిక్స్- 18

కార్పెంటర్- 16

ఎంఎంటీఎం- 12

ఆన్‌లైన్ దరఖాస్తు ప్రారంభం- 2019 నవంబర్ 9

దరఖాస్తుకు చివరి తేదీ- 2019 డిసెంబర్ 8 రాత్రి 11.30 గంటలు

విద్యార్హత- 50% మార్కులతో 10వ తరగతి, సంబంధిత ట్రేడ్‌లో ఐటీఐ.

ఫీజు- రూ.100

వయస్సు- 15 నుంచి 24 ఏళ్లు. ఎస్సీ, ఎస్టీలకు 5 ఏళ్లు, ఓబీసీ అభ్యర్థులకు 3 ఏళ్లు, వికలాంగులకు 10 ఏళ్లు వయస్సులో సడలింపు.

ఇస్రోలో జాబ్స్

నెల్లూరు జిల్లా శ్రీహరికోటలోని భారతీయ అంతరిక్ష పరిశోధన కేంద్రానికి చెందిన సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ షార్‌లో ఉద్యోగాల భర్తీకి రెండు నోటిఫికేషన్లు విడుదలయ్యాయి. టెక్నీషియన్ బీ, రీసెర్చ్ అసోసియేట్ పోస్టుల్ని భర్తీ చేస్తోంది సతీష్ ధావన్ స్పేస్ సెంటర్. మొత్తం 92 ఖాళీలున్నాయి. శ్రీహరికోటలోని షార్ కేంద్రంతో పాటు ఇతర సెంటర్లలో వీరిని నియమిస్తారు. ఈ పోస్టులకు ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రారంభమైంది.

టెక్నీషియన్ బీ పోస్టుకు రూ.21,700 నుంచి రూ.69,100 మధ్య వేతనం ఉంటుంది. రీసెర్చ్ అసోసియేట్‌కు రూ.47,000 వేతనం ఉంటుంది. ఈ పోస్టులకు రెండు నోటిఫికేషన్లు వేర్వేరుగా విడుదలయ్యాయి.

మొత్తం ఖాళీలు- 92

దరఖాస్తు ప్రారంభం- 2019 నవంబర్ 9

దరఖాస్తుకు చివరి తేదీ- 2019 నవంబర్ 29 సాయంత్రం 5 గంటలు

విద్యార్హతలు- టెక్నీషియన్ బీ పోస్టుకు 10వ తరగతితో పాటు సంబంధిత ట్రేడ్‌లో ఐటీఐ. రీసెర్చ్ అసోసియేట్‌కు మెటెరాలజీ, ఆట్మోస్ఫెరిక్ సైన్సెస్, ఓషియనోగ్రఫీ, ఫిజిక్స్, అప్లైడ్ ఫిజిక్స్‌లో పీహెచ్‌డీ ఉండాలి.

వేతనం- టెక్నీషియన్ బీ పోస్టుకు రూ.21,700 నుంచి రూ.69,100. రీసెర్చ్ అసోసియేట్‌కు రూ.47,000.

వెబ్ సైట్: https://apps.shar.gov.in/sdscshar/result1.jsp

Leave a Reply