TRENDING NOW

జియో దీపావళి ఆఫర్..

జియో దీపావళి ఆఫర్..

ముంబై, 6 నవంబర్:

రిలయెన్స్ జియో దీపావళి సందర్బంగా తమ వినియోగదారులకు భారీ ఆఫర్లను ప్రకటించింది. ఇన్నాళ్లూ ఫ్లాష్‌సేల్‌లోనే అందుబాటులో ఉన్న జియోఫోన్ 2 ఓపెన్ సేల్‌ ద్వారా కొనొచ్చు.  ఈ ఫోన్ అసలు ధర రూ.రూ.2,999. దీపావళి ఆఫర్‌లో భాగంగా రూ.200 పేటీఎం క్యాష్‌బ్యాక్ లభిస్తుంది.

క్వర్టీ కీప్యాడ్, వెడల్పు డిస్‌ప్లే, 4జీ ఫీచర్‌‌, వీఓవైఫై, బ్లూటూత్, వైఫై, జీపీఎస్‌తో పాటు ఫేస్‌బుక్, యూట్యూబ్, వాట్సప్ యాప్స్‌ని సపోర్ట్ చేయడం ఈ ఫోన్ ప్రత్యేకత.

Life Homepathy
GCR Infra AD, Maamaata, SEO, Primepagesinfo,
treefurn AD

జియో ఫోన్ 2 ఎలా కొనాలంటే

రిలయెన్స్ అఫిషియల్ వెబ్‌సైట్ jio.com లేదా మైజియో యాప్‌లోకి వెళ్లాలి. జియో ఫోన్ 2 సెలెక్ట్ చేసుకొని పిన్ కోడ్ ఎంటర్ చేయాలి. ప్రొసీడ్ టు చెక్ ఔట్ బటన్ క్లిక్ చేయాలి. పేరు, ఇ-మెయిల్ ఐడీ, మొబైల్ నెంబర్ లాంటి వివరాలు ఎంటర్ చేయాలి. పేమెంట్ ఆప్షన్ సెలెక్ట్ చేసి రూ.2999 చెల్లించాలి. రూ.200 పేటీఎం క్యాష్‌బ్యాక్ లభిస్తుంది. ఈ ఫోన్ నవంబర్ 12 వరకు ఓపెన్‌ సేల్‌లో అందుబాటులో ఉంటుంది.

అలాగే జియో యూజర్లు పేటీఎం, ఫోన్‌పే, అమెజాన్ పే, మొబిక్విక్‌ ద్వారా రీఛార్జ్ చేసుకుంటే రూ. 300 వరకు క్యాష్‌బ్యాక్ లభిస్తుంది. జియో సబ్‌స్క్రైబర్స్ కోసం ఏడాది వ్యాలిడిటీ ఉన్న ప్లాన్ ప్రకటించింది. రూ.1,699 చెల్లిస్తే 547 జీబీ 4జీ డేటా, అన్‌లిమిటెడ్ కాల్స్ ఏడాది వరకు లభిస్తాయి. ఈ ప్లాన్‌పై 100% క్యాష్‌బ్యాక్ ఇవ్వడం మరో విశేషం.

మామాట: బంపర్ ఆఫర్లే ఇస్తున్నారుగా…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Menu
%d bloggers like this: