జియో వినియోగదారులకి న్యూఇయర్ బంపర్ ఆఫర్..

Share Icons:

న్యూఢిల్లీ, 23 డిసెంబర్:  

ప్రముఖ టెలికాం సంస్థ రిలయన్స్‌ జియో తన వినియోగదార్లకు ఆఫర్లు మీద ఆఫర్లు ప్రకటిస్తుంది. నూతన సంవత్సరం కానుకగా మరో రెండు కొత్త ప్లాన్లను తీసుకొచ్చేసింది.

హ్యాపీ న్యూఇయర్‌ 2018 స్కీమ్‌ కింద రూ.199 ప్లాన్‌. మరొకటి రూ.299 ప్లాన్‌ ఇవ్వనుంది . నేటి అర్థరాత్రి నుంచి జియో ప్లాన్లు అమల్లోకి రానున్నాయి.

రూ.199 ప్లాన్ :

రూ.199 ప్లాన్‌ కింద అపరిమిత డేటా(రోజుకు 1.2జీబీ హైస్పీడ్‌ 4జీ డేటా), అపరిమిత కాల్స్‌, అపరిమిత ఎస్సెమ్మెస్‌లు, జియో యాప్స్‌ లభిస్తాయి.

ప్రైమ్‌ మెంబర్స్‌‌కు ఈ సదుపాయాలు వర్తిస్తాయని కంపెనీ ఓ ప్రకటనలో తెలిపింది. ఈ ఆఫర్ కాలపరిమితి 28 రోజులు.

రూ.299 ప్లాన్:

ఇక ఎక్కువ డేటా వాడే వారికోసం రూ.299 ప్లాన్‌ను లాంచ్‌ చేసింది.

దీని కింద 28 రోజులకు రోజుకు 2జీబీ డేటాతో పాటు అపరిమిత కాల్స్‌, అపరిమిత ఎస్సెమ్మెస్‌లు, జియో ప్రైమ్‌ మెంబర్లందరికీ ప్రీమియం జియో యాప్స్‌ సబ్‌స్క్రిప్షన్‌ను 28 రోజుల పాటు అందించనున్నట్టు ప్రకటించింది.

ఇప్పటికే రూ.149 ప్లాన్‌ కింద 28 రోజుల పాటు 4జీబీ డేటాను, అపరిమిత కాలింగ్‌, ఎస్‌ఎంఎస్‌లను అందిస్తోంది. ఇప్పుడు హ్యాపీ న్యూఇయర్‌ 2018 కింద తన కస్టమర్లకు ఈ రెండు సరికొత్త ప్లాన్లను అందిస్తుంది.

మామాట: నూతన సంవత్సరం జియో వినియోగదారులకి బాగానే ఆఫర్లు ఇస్తూ ఆకర్షిస్తుంది.

Leave a Reply