ఊహించని బంపర్ ఆఫర్లు ఇచ్చిన జియో..

Jio GigaFiber to come with free FullHD TV for Jio Forever Plan users
Share Icons:

ముంబై:

 

టెలికాం దిగ్గజ సంస్థ రిలయన్స్ జియో ఊహించని ఆఫర్లు ఇచ్చింది. రిలయన్స్ 42వ వార్షిక సర్వసభ్య సమావేశంలో ముఖేష్ అంబానీ కీలక ప్రకటన చేశారు. జియో నుంచి నాలుగు రకాల బ్రాడ్‌బ్యాండ్ సేవలను అందుబాటులోకి తీసుకురానున్నట్లు ఆయన ప్రకటించారు. సెప్టెంబర్ 5న జియో ఫైబర్‌ సేవలను అందుబాటులోకి తీసుకొస్తామని ముఖేష్ ప్రకటించారు. జియో హోం బ్రాడ్‌బ్యాండ్‌లో భాగంగా సెకనుకు 1జీబీ స్పీడ్‌తో 100 జీబీ ఇంటర్నెట్, ఉచిత ల్యాండ్‌లైన్ సౌకర్యం, వీడియో కాన్ఫరెన్స్, యూహెచ్‌డీ సెటాప్ బాక్స్‌ను అందించనున్నట్లు తెలిపారు. అలాగే ఒకే కనెక్షన్‌తో ఇంటర్నెట్, డీటీహెచ్, ల్యాండ్‌లైన్ సేవలను అతి తక్కువ ధరకే అందుబాటులోకి తీసుకురానున్నట్లు ముఖేష్ అంబానీ స్పష్టం చేశారు.

 

ఉచిత వాయిస్ కాల్స్, అతి తక్కువ చార్జీతో ఇంటర్నేషనల్ కాలింగ్ సదుపాయం, అందుబాటులోకి తీసుకురానున్నట్లు తెలిసింది. అంతేకాదు, వెల్‌కమ్ ఆఫర్‌లో భాగంగా జియో ఫైబర్ వార్షిక ప్లాన్స్‌తో 4కే సెట్ టాప్ బాక్స్‌తో పాటు హెచ్‌డీ/4కే ఎల్‌ఈడీ టీవీ ఉచితంగా ఇవ్వనున్నట్లు సమాచారం. అలాగే ఫస్ట్ డే ఫస్ట్ షో స్క్రీనింగ్స్… అంటే థియేటర్‌లో విడుదలయ్యే సినిమాను ఇంట్లోనే కూర్చుని చూసే సదుపాయం ఇవ్వనుంది.

 

2020 నుండి జియో సెట్ అప్ బాక్స్ ద్వారా ఈ అవకాశం అందుబాటులోకి రానున్నట్లు తెలిపారు. ఇది సాధారణంగా వినియోగదారులకు ఆనందాన్ని కలిగించే విషయమే. అయితే ఇది సినిమా రంగంపై ప్రభావం చూపుతుందనే దిశగా పలు అనుమానాలు, అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

 

Leave a Reply