జియో 4కె సెట్ టాప్ బాక్స్ ఫీచర్లు…

jio giga set top box features
Share Icons:

ముంబై:

 

టెలికాం దిగ్గజ సంస్థ రిలయన్స్ జియో 42వ వార్షికోత్సవం పురస్కరించుకుని సెప్టెంబర్ 5వ తేదీ నుంచి వినియోగదారులకు జియో గిగాఫైబర్ సేవలను అందిస్తున్న విషయం తెలిసిందే. జియో గిగాఫైబర్ 4కె సెట్ టాప్ బాక్స్‌లో చాలా ఫీచర్లు ఉన్నాయి. ఈ బాక్స్ ద్వారా 4కె అల్ట్రా హెచ్‌డీ నాణ్యత కలిగిన టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు, అలాగే వర్చువల్ రియాలిటీ, అగ్‌మెంటెడ్ రియాలిటీలను కలిపి నూతనంగా ఎంఆర్ పేరిట మరో సదుపాయాన్ని ఈ బాక్స్‌లోని పలు యాప్స్‌లలో అందిస్తున్నారు.

 

వాటి ద్వారా వినియోగదారులు షాపింగ్‌కు వెళ్లకున్నా.. ఇంట్లోనే ఉండి దుస్తులను ట్రై చేయవచ్చని, తమకు నచ్చే దుస్తులను వర్చువల్ రియాలిటీలో చూసుకుని అనంతరం వాటిని ఆన్‌లైన్‌లో ఆర్డర్ చేయవచ్చు. అలాగే దీని ద్వారా ప్రపంచంలో ఎక్కడ ఉన్నా, ఎవరికైనా ఉచితంగా వీడియో కాల్స్ చేసుకోవచ్చు. ఇందుకు గాను జియో కాల్ పేరిట ఓ యాప్‌ను అందిస్తున్నామని సంస్థ వారు తెలిపారు. ఇక ఈ బాక్సులో హోమ్ సెక్యూరిటీ, స్మార్ట్‌హోం ఫీచర్లను కూడా అందిస్తామని తెలిపారు

 

అలాగే దీని స్పీడు 1జీబీపీఎస్ వరకు నమోదు కావడం విశేషం. కాగా జియో గిగాఫైబర్‌తో అందివ్వనన్న బ్రాడ్‌బ్యాండ్‌తో కనీసం 100 ఎంబీపీఎస్ మొదలుకొని గరిష్టంగా 1 జీబీపీఎస్ వరకు ఇంటర్నెట్ స్పీడ్‌ను అందిస్తామని ముఖేష్ అంబానీ వెల్లడించారు.

 

Leave a Reply