డైరీ మిల్క్ చాక్లెట్ కొంటె జియో డేటా ఫ్రీ…

Jio data free on dairy milk chocolates
Share Icons:

ఢిల్లీ, 7 సెప్టెంబర్:

రెండో వార్షికోత్సవం సందర్భంగా జియో కాడ్బరీ సంస్థతో ఒప్పందం కుదుర్చుకుని వినియోగదారులకి బంపర్ ఆఫర్ ఇచ్చింది. ఈ ఆఫర్‌లో భాగంగా డైరీ మిల్క్ చాక్లెట్ కానీ, డైరీ మిల్క్ క్రాకెల్, డైరీ మిల్క్ రోస్ట్ అల్మండ్, డైరీమిల్క్ ఫ్రూట్, నట్ తదితరాలు కొనుగోలు చేసే వారికి అదనంగా రోజుకు 1జీబీ 4జీ డేటా లభిస్తుంది.

ఈ నెల 30 వరకు, రూ.5 నుంచి రూ.100 చాక్లెట్ల కొనుగోలుపై ఈ ఆఫర్ వర్తిస్తుంది. చాక్లెట్ రేపర్ మీద ఉన్న బార్‌కోడ్‌ను యూజర్లు స్కాన్ చేయడం ద్వారా ఉచిత డేటాను పొందవచ్చు.

అలాగే జియో సరికొత్త సెలబ్రేషన్స్ ప్యాక్ ద్వారా యూజర్లకు ప్రతి రోజూ రోజుకు 2జీబీ డేటా ఈ నెల 11వ తేదీ వరకు లభిస్తుంది. అంటే మొత్తం 10 జీబీ డేటా అదనంగా లభిస్తుందన్నమాట. నేటి నుంచి ఈ నెల 11వ తేదీ వరకు ప్రతి రోజూ రాత్రి 12 గంటలకు ఈ ప్యాక్ యాక్టివేట్ అవుతుంది.

మామాట: వినియోగదారులని ఆకర్షించడానికి భలే ఆఫర్లు ఇస్తున్నారుగా….

Leave a Reply