*మరో ఆధ్యాత్మిక మహోన్నతుడు జిడ్డు కృష్ణమూర్తి*
మనకు లభించిన అరుదైన ఆధ్యాత్మిక మహా పురుషులలో జిడ్డు కృష్ణమూర్తి ఒకరు. ఆయన మనిషిగా మహోన్నతి చెందిన వారు. ఒక కుసుమంలా వికసించారు. దైవం పేరుతోనో, అతీత శక్తుల ముసుగులోనో పెరిగి పేరు సంపాదించ లేదు. ఆయనొక విజ్ఞాన ఖని. మానవ జీవితానికి సంబంధించిన విషయాలనే ప్రస్తావించారు. పరీక్షకు నిలిచినా అంశాన్నే స్వీకరించారు. జీవిత తత్వాన్ని లోతుగా పరిశీలించారు. తాను చెప్పినదైనా ఆలోచించి అవగాహన చేసుకోమన్నారు.
జగత్తులో మానవ సంక్షేమకోసం తహ తహలాడారు. బాల్యం నుంచే మహోన్నత భావ, గుణ, లక్షణ,లక్షితుడైన పరిపూర్ణ మానవతా మూర్తి జిడ్డు కృష్ణమూర్తి.. నిశిత పరిశీలన, సూక్ష్మ అవగాహనల సమ్మిళితమే ఆయన జీవితం. సంపూర్ణ స్వేచ్ఛ ఆయన వికాసానికి ఊపిరి. సమస్త మానసిక, భౌతిక నిబద్ధతకు లోనుగాకుండా ఉందాం. ఆ స్వేచ్ఛకు జీవం, ఆయన మేధా సంపత్తి, విశాల హృదయం సమపాళ్ళలో వృద్ది చెందాయి. అందుకే సామాన్య వ్యక్తిగా జన్మించి అనన్య సామాన్య, విశ్వ మానవునిగా శిఖరాలను ఆరోహించారు..
ఆయన గురించి ఈ తరానికి తెలియాల్సింది ఎంతో ఉంది. అయన 91 సంవత్సరాల నవయువకుడు, నవయుగ వైతాళికుడు. తాను బోధకుడనో, గురువునో కాదన్నారు. పదిమందితోబాటు విషయ చర్చచేస్తూ స్వస్వరూప జ్ఞానంద్వారా సత్యాన్ని తెలుసుకో వాలన్నరు. తాను చెప్పిన అంశాలను సాధికారికంగా తీసుకుని వల్లెవేయడం తగదని, జాగ్రత్తగా పరిశీలించి ఎవరికివారు నిగ్గుతేల్చుకోవాలని ఒకటికి పది సార్లు చెప్పే వారాయన.. అందుకే ఆయన గురించి …