జార్ఖండ్ ఫలితాలు…యూ‌పి‌ఏ కూటమి విజయం ఏకపక్షమే…

jharkhand-election-results-power-shift-from-2014-to-2019-in-state
Share Icons:

రాంచీ:  మహారాష్ట్రలో అధికారాన్ని కోల్పోయిన బీజేపీకి… ఈరోజు వెలువడుతున్న ఝార్ఖండ్ ఎన్నికల ఫలితాలు తీవ్ర నిరాశను మిగిల్చాయ. జార్ఖండ్ ఎన్నికల్లో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీకి ఎదురుదెబ్బ తగిలింది. స్థానిక పార్టీ జార్ఖండ్ ముక్తి మోర్చా ప్రభంజనంతో బీజేపీ వెనుకబడి పోయింది. వాస్తవానికి ఎగ్జిట్ పోల్స్‌లో అధికారం కోల్పోతుందని చెప్పినప్పటికీ అతి పెద్ద పార్టీగా బీజేపీనే నిలుస్తుందని ఫలితాలు వెల్లడించాయి. లెక్కింపు ప్రారంభం నుంచి ఇదే అంచనాలు కొనసాగినప్పటికీ.. లెక్కింపు తుది దశకు వస్తున్నాకొద్ది ఫలితాలు తారుమారవుతున్నాయి. ప్రస్తుతం అతిపెద్ద పార్టీగా జేఎంఎం అవతరించబోతున్నట్లు ఫలితాలు వెల్లడవుతున్నాయి.

జార్ఖండ్‌ అసెంబ్లీలో మొత్తం 81 స్థానాలు ఉన్నాయి. అయితే ప్రస్తుతం జరుగుతున్న లెక్కింపులో జేఎంఎం 31 స్థానాల్లో ముందంజలో ఉంది. బీజేపీ 22 స్థానాల్లో మాత్రమే ఆధిపత్యం కొనసాగిస్తోంది. ఇక మొత్తం గా చూసుకుంటే మ్యాజిక్ ఫిగర్ 41 స్థానాలు రావాలి. ప్రస్తుతం యూ‌పి‌ఏ కూటమి 39 స్థానాల్లో లీడింగ్ ఉంటే 10 స్థానాల్లో విజయం సాధించింది. అటు బీజేపీ 15 స్థానాల్లో ఆధిక్యం…7 స్థానాల్లో విజయం సాధించింది. ఇక ఇతరులు 10 స్థానాల్లో లీడింగ్ లో ఉన్నారు.

లెక్కింపు పూర్తయ్యే వరకు ఇదే కొనసాగితే జార్ఖండ్‌లో అతిపెద్ద పార్టీగా జేఎంఎం అవతరిస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు. ఈ ఫలితాలపై కాంగ్రెస్ సీనియర్ నేత మల్లికార్జున ఖర్జే స్పందిస్తూ…బీజేపీ ఇచ్చిన హామీలు, పెద్ద పెద్ద వాగ్దానాలను ప్రజల ముందుకు తీసుకువెళ్లడం మా బాధ్యత. బీజేపీ మాత్రం మేము తలపెట్టిన కార్యక్రమాలన్నీ విజయవంతంగా అమలు చేసామని చెబుతోంది. జీఎస్‌టీ, పెద్ద నోట్ల రద్దు నిర్ణయాలు విజయవంతమయ్యాయా? 15 లక్షల ఉద్యోగాలంటూ ఇచ్చిన హామీ ఏమైంది?’ అని ఖర్గే మీడియాతో మాట్లాడుతూ అన్నారు. రైతులు వారికి (బీజేపీ) వ్యతిరేకంగా ఉన్నారని, ఇచ్చిన హామీలు నిలుపుకోని పక్షంలో ప్రజలు తగిన గుణపాఠం చెప్పితీరుతారని ఆయన పేర్కొన్నారు.

బీజేపీని శివసేన మరోసారి టార్గెట్ చేసింది. పౌరసత్వ సవరణ చట్టంతో బీజేపీకి ఒరిగిందేమీ లేదని… ఆ పార్టీ మరో రాష్ట్రాన్ని కోల్పోయిందని శివసేన ఎంపీ సంజయ్ రౌత్ అన్నారు. ఝార్ఖండ్ ను బీజేపీ ఐదేళ్లు పాలించిందని… మరోసారి అధికారాన్ని కైవసం చేసుకోవడానికి ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షాలు సర్వశక్తులను ఒడ్డారని చెప్పారు. మోదీ పేరు చెప్పుకుని ఓట్లను రాబట్టుకునేందుకు యత్నించిన బీజేపీ బోర్లా పడిందని అన్నారు. మహారాష్ట్ర ఓటమి తర్వాత ఝార్ఖండ్ ను కూడా ఎందుకు కోల్పోవాల్సి వచ్చిందో బీజేపీ ఆత్మపరీక్ష చేసుకోవాలని చెప్పారు.

 

 

Leave a Reply