పవన్ కి జేడీ షాక్ ఇవ్వనున్నారా?

Share Icons:

అమరావతి:

 

ఇటీవల ఏపీ ఎన్నికల్లో జనసేన పార్టీ ఘోరంగా ఓడిపోయిన విషయం తెలిసిందే. ఆ పార్టీ కేవలం ఒకే ఒక సీటు గెలుచుకుంది. ఆ పార్టీ అధినేత పవన్ కల్యాణ్ పోటీ చేసిన రెండు చోట్ల ఓడిపోయారు. ఇక ఓటమి తర్వాత కొందరు నాయకులు సైలెంట్ అయిపోగా, కొందరు పార్టీ మారిపోతున్నారు. ఈ క్రమంలోనే జనసేనకు మరో షాక్ తగలనుందని తెలుస్తోంది. ఆ పార్టీ కీలక నేత, మాజీ సీబీఐ డైరెక్టర్ లక్ష్మీనారాయణ జనసేనకు గుడ్ బై కొట్టనున్నట్టు సమాచారం.

 

లక్ష్మీనారాయణతో పాటు ఆయన అనుచరుడు గంపల గిరిధర్ కూడా జనసేనకు గుడ్ బై కొట్టనున్నారు. త్వరలో వారిద్దరూ బీజేపీలో చేరనున్నట్టు సమాచారం. 2019 ఎన్నికలకు ముందు జేడీ లక్ష్మీనారాయణ జనసేన పార్టీలో చేరారు. ఇక విశాఖపట్నం లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేసి ఓడిపోయారు. గంపల గిరిధర్ విశాఖ నార్త్ నియోజకవర్గం నుంచి జనసేన తరఫున ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయారు. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో జనసేనకు రాజకీయ భవిష్యత్ ఉండదన్న ఉద్దేశంతో వారిద్దరూ బీజేపీలో చేరాలని నిర్ణయించుకున్నట్టు తెలిసింది.

 

Leave a Reply